పవన్‌కల్యాణే నాకు కథ చెప్పారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘పవర్’ సినిమా తర్వాత పవన్‌కల్యాణ్ నుండి కలవమని ఫోన్ వచ్చింది. మొదట్లో షాక్ అయినా ఆయనతో సినిమా చేయాలని కథ రెడీ చేసుకున్నా. కథ నచ్చకపోతే కనీసం ఆయనతో ఫొటో అయినా దిగొచ్చనే ఆలోచనతో కలిశాను’ అని అంటున్నాడు దర్శకుడు బాబి. ప్రముఖ నటుడు పవన్‌కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు బాబి (కె.ఎస్.రవీంద్ర). నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం ఈనెల 8న విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు బాబితో ముఖాముఖి..
* ఈ సినిమా ఎలా సెట్ అయ్యింది?
- ‘పవర్’ సినిమా తర్వాత పవన్‌కల్యాణ్ నుండి పిలుపు వచ్చింది. నవంబర్ 2014లో ఆయన్ను కలిశాను. కలిసినప్పుడు ఆయన తన దగ్గర కథ వుంది, వినమని చెప్పారు. నిజానికి నేను కథ చెబుదామని వెళితే ఆయనే నాకు కథ చెప్పారు. కథ బాగా నచ్చింది. దాన్ని అడాప్ట్‌చేసుకోడానికి కొంత సమయం పట్టింది. ఈ సమయం మొత్తం కల్యాణ్‌తోనే ఉన్నాను. ఏప్రిల్ 2015లో షూటింగ్ మొదలుపెట్టాం.
* గబ్బర్‌సింగ్ సినిమాకు రీమేక్ అన్నప్పుడు ఎలా ఫీలయ్యారు?
- మొదట్లో చాలా టెన్షన్ పడ్డాను. గబ్బర్‌సింగ్ లాంటి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్‌గా వచ్చే సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి కాబట్టి కథ కూడా అంతే భారీగా ఉండాలని అనుకున్నాను. కానీ పవన్ చెప్పిన కథ సంతృప్తిగా అనిపించడంతో ప్రొసీడ్ అయ్యాం.
* డైరెక్షన్‌లో పవన్ ఇన్వాల్వ్‌మెంట్ ఎంతవరకు ఉంది?
- నిజానికి ఆయన కూడా దర్శకుడు కాబట్టి ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయ్యారని వార్తలు వచ్చాయి. ఈ సినిమాకు ఆయన స్క్రిప్ట్‌సైడ్ మాత్రమే సపోర్ట్ అందించారు. కానీ డైరెక్షన్ విషయంలో ఆయన ఇన్వాల్వ్ కాలేదు.
* పవన్‌తో పనిచేయడం ఎలా వుంది?
- సాధారణంగా ఆయనతో పనిచేయడం ఒక రకంగా కష్టమే. కానీ ఆయన ఆలోచనా విధానానికి మనం సింక్ అయితే ఆయనతో చేసే ప్రయాణం సాఫీగా వుంటుంది. తను చాలా కమిట్‌మెంట్ వున్న వ్యక్తి. దాంతోపాటు ఒకేసారి మూడునాలుగు పనుల గురించి ఆలోచిస్తారు. ఆయనతో పనిచేయడం గొప్ప అనుభూతి.
* ఈ సినిమా హిందీలో చేయాలనే ఆలోచన ఎవరిది?
- హిందీలో చేయాలన్న ఆలోచన నిర్మాత శరత్‌మరార్, పవన్‌లదే. దానికోసం ప్రత్యేకంగా ఓ టీమ్‌ను కూడా నియమించాం. హిందీలో భారీ స్థాయిలో 800 థియేటర్లలో విడుదలవుతుంది.
* ట్రైలర్‌లోనే కథ చెప్పినట్టున్నారు?
- ఔను. ఈ ఆలోచన పవన్‌కల్యాణ్‌దే. ఈ సినిమా మొదలైన దగ్గర్నుంచి భారీ అంచనాలున్నాయి. దాంతో ఈ అంచనాలకు బ్రేక్ వెయ్యాలనే ఉద్దేశంతో ట్రైలర్‌లోనే కథ చెప్పాం. కాబట్టి ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తూ సినిమా చూస్తారనే ఉద్దేశం.
* రతన్‌పూర్ అనే విలేజ్ ఐడియా ఎవరిది?
- ఈ కథను క్రియేట్ చేసిన కల్యాణ్‌దే. ఆయన కథ రాసుకున్నప్పుడే ఛత్తీస్‌గఢ్, ఆంధ్రా, తెలంగాణాల బార్డర్‌లో వుండే ఒక విలేజ్‌గా రతన్‌పూర్‌ను క్రియేట్ చేశాడు. దానికోసం ప్రత్యేకంగా సెట్ కూడా వేయించాం.
* ఈ సినిమాతో పవన్ మీకిచ్చిన సపోర్ట్ ఎలాంటిది?
- నిజంగా ఆయనలా ఎవరూ సపోర్ట్ చేయలేదు. ఒక సీన్ బాగా వచ్చింది అంటే వెంటనే అద్భుతంగా వుందని పొగిడేస్తారు. ఆయన పొగడ్తలవల్ల వచ్చే బలం వేరేగా వుంటుంది. నేను మంచి దర్శకుడిని అవుతానని, వీలైతే సినిమా చేయమని చిరంజీవికి పవన్ నా పేరు సిఫార్సు చేశారని తెలిసింది. మొదటినుంచి నాకు చిరంజీవిగారంటే ఇష్టం. అలాంటిది ఆయనకే పవన్ ఇలా చెప్పడం మరచిపోలేని అనుభూతి.
* మరి చిరంజీవితో సినిమా చేస్తారా?
- తప్పకుండా ఉంటుంది. ఆయనతో సినిమా చేయడం గొప్ప అవకాశమే కదా?
* పవన్‌తో సినిమా ఓకే అయ్యాక మొదటిసారి ఎవరితో షేర్ చేసుకున్నారు?
-ఈ సినిమా చేద్దామని ఆయన ఫిక్స్ అవ్వగానే వెంటనే రవితేజను కలిశాను. ఆయన సొంత బ్రదర్‌కన్నా ఎక్కువగా సంతోషపడ్డారు. ఆ తర్వాత మా ఇంట్లో వాళ్లకి చెప్పా.
* పవన్‌తో చిరంజీవి వీణ స్టెప్ వేయించడానికి కారణం?
- ఈ ఆలోచన ఆయనదే. ఎప్పటినుండో చిరంజీవిగారు సాంగ్‌ని తన సినిమాలో వాడాలని అనుకుంటున్నారు. అలాంటి సమయంలోనే వీణ స్టెప్ అంటేనే చిరంజీవిగారు గుర్తొస్తారు కాబట్టి అదే ట్రై చేసారు.
* తదుపరి చిత్రాలు?
- ఈ సినిమా తర్వాత నెల రోజులు రెస్ట్ తీసుకుని, ఆ తర్వాత వేరే సినిమాల గురించి ఆలోచిస్తా.

- శ్రీ