ఈ తులసీదళం విభిన్నం .. -దర్శకుడు ఆర్.పి.పట్నాయక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిశ్చల్, వందనాగుప్త జంటగా కలర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఆర్.పి.పట్నాయక్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘తులసిదళం’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని రేపు విడుదలకు సిద్ధంగా వుంది. ఈ సందర్భంగా ఆర్.పి.పట్నాయక్ చెప్పిన విశేషాలు..ఆయన మాటల్లోనే
ప్రేమకు సమస్య హారరే
జనరల్‌గా హారర్ సినిమాలంటే చీకట్లోనే వుంటాయి. కానీ, ఈ చిత్రాన్ని ప్రపంచంలోనే అత్యంత వెలుతురు కలిగిన ప్రాంతమైన లాస్‌వెగాస్‌లో 44 రోజులపాటు చిత్రీకరించాం. అందమైన ప్రేమకథకు భయమే సమస్య అయితే ఎలా వుంటుందనే కథతో తెరకెక్కిన చిత్రమిది. తులసిదళం శ్రీకృష్ణుడికి సమానంగా సరితూగగలిగేది కాబట్టి, ఈ సినిమాలో కూడా కథకు అంతటి ప్రాముఖ్యత వుందని ఈ సినిమాకు ఆ టైటిల్ పెట్టాం.
నా మార్క్ సంగీతం
చాలామంది మీ సంగీతాన్ని మిస్ అవుతున్నామని, మళ్లీ ఎప్పుడు అలాంటి సంగీతాన్ని వినిపిస్తారని అడుగుతున్నారు. వారందరికీ సమాధానం ఈ చిత్రం. ఇప్పటికే పాటలు మంచి విజయాన్ని సాధించాయి. ఖచ్చితంగా ఇది మ్యూజికల్ ఫిలిం అని చెప్పవచ్చు. ఈ సినిమా మొత్తం ఫారిన్‌లో షూటింగ్ చేసినా తెలుగు నేటివిటీకి దగ్గరగా వుంటుంది. ఇండియన్ ఎమోషన్స్, సెంటిమెంట్స్ ఈ సినిమాలో వుంటాయి.
టర్నింగ్ కావాలని తీసుకున్నదే
సంగీత దర్శకుడిగా వున్న నేను నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా మారడానికి కారణం, ఏదో కొత్తగా అందించాలనే తపనే. అవతలివారి ఆలోచనలు ఆగిపోయినచోట నా ఆలోచనలు మొదలవుతాయి. ఉదాహరణకు, అవినీతిని నిరోధించాలంటే ఓ ఠాగూరో, ఓ అపరిచితుడో రావాలని అనుకుంటాం. కానీ నిజ జీవితంలో అది సాధ్యంకాదు. అదే మనం జనరల్‌గా చూసే ఓ బ్రోకర్‌లో మార్పు వస్తే ఎలా వుంటుందనే ఆలోచనతో చేసిందే ‘బ్రోకర్’ సినిమా. అది జనాలకి బాగా నచ్చింది. అలా నా ఆలోచనలు భిన్నంగా వుంటాయి.
తదుపరి చిత్రాలు
ప్రస్తుతం జర్నలిజానికి సంబంధించిన కథతో చేస్తున్న ‘మనలో ఒకడు’ షూటింగ్ జరుగుతోంది. దాంతోపాటు కన్నడ తెలుగు భాషల్లో మరో చిత్రం వుంది.

-శ్రీ