రిస్క్ చేయక తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పటివరకూ మోడ్రన్‌గా కనిపించిన నేను మొదటిసారిగా స్లమ్‌లో వుండే అమ్మాయిగా మాస్ పాత్రలో కనిపిస్తాను. ఈ పాత్ర చేయడం నాకు కొత్తగా అనిపించిందని అంటోంది హీరోయిన్ రేష్మీ. సినిమాల్లో హీరోయిన్‌గా కంటే కూడా జబర్దస్త్ ప్రోగ్రామ్ యాంకర్‌గా బాగా పాపులర్ అయిన ఈమె నటిస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు టాకీస్’. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధవౌతున్న సందర్భంగా రేష్మీతో ఇంటర్వ్యూ..
మీ పాత్ర ఎలా వుంటుంది?
సువర్ణ అనే పాత్ర స్లమ్‌లో వుండే అమ్మాయి. ఆమెకి చాలా పొగరు కూడా వుండే వుంటుంది. ఈ కథ విన్నప్పుడే కొత్తగా అనిపించింది. నేను ఇప్పటివరకూ మోడ్రన్‌గా కనిపించాను.
ఈ పాత్ర చేయడానికి కారణం?
దర్శకుడు ప్రవీణ్ కథ చెప్పినప్పుడు చాలా కొత్తగా అనిపించింది. తొలిసారి హీరోయిన్‌గా చేస్తున్నాను కాబట్టి కాస్త డిఫరెంట్ ఉంటే బావుంటుందని చేశాను.
గ్లామర్‌కే ప్రాముఖ్యత ఇచ్చినట్టున్నారు?
కథ ప్రకారం అలా చేయాల్సి వచ్చింది. ఇది కావాలని చేసింది కాదు. ప్రస్తుతం సినిమాల్లో గ్లామర్ ఉంటేనే కదా ప్రేక్షకులు ఆకట్టుకునేది.
టీవీ మీడియాతో కెరీర్ బాగా పాపులర్ అయింది కదా?
ఔను. నేను హీరోయిన్‌గా ఇదివరకే ఒకటి రెండు సినిమాలు చేశాను. ఆ తర్వాత టీవీ షో చేయడంతో పాపులారిటీ వచ్చింది. ఏదేమైనా టీవీ షోద్వారా వచ్చిన పాపులారిటీని మరిచిపోలేను. కానీ, సినీ హీరోయిన్‌గా కూడా సెటిలవ్వాలనివుంది.
హీరోతో ప్రేమాయణం ఉందనే వార్తలు..?
ఈ సినిమాలో ఓ రొమాంటిక్ సాంగ్ కోసం ఇద్దరం కలసి కాస్త ఎక్కువగానే తిరిగాం. దానికి కారణం మామధ్య ర్యాపో ఎక్కువవుతుందని అంతే, తను నాకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే.
గాసిప్స్ గురించి ఎలా స్పందిస్తారు?
మొదట్లో కొంచెం బాధపడేదాన్ని. కానీ ఇప్పుడు దాని గురించి పట్టించుకోవడం మానేశా.
హీరోయిన్‌గా కాకుండా మిగతా పాత్రల్లో చేస్తారా?
తప్పకుండా చేస్తాను. కానీ నా పాత్రకంటూ ప్రత్యేకత వుండాలి. అలా వుంటే హీరోయిన్ చెల్లిగా కూడా నటిస్తా.
తదుపరి చిత్రాలు?
ప్రస్తుతానికి తను వచ్చెనంట చిత్రం షూటింగ్ జరుగుతోంది. దాంతోపాటు మరో సినిమా కూడా వుంది. అలాగే ఇదివరకే రాణిగారిగది సినిమా కూడా రెడీ అవుతోంది. వీటితోపాటు దేనికైనారెడీ అనే టీవీ షో కూడా చేస్తున్నాను.