హీరో కాదు, కథే ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలామొదలైంది సినిమాతో దర్శకురాలిగా పరిచయమై తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది నందినీ రెడ్డి. ఆ తర్వాత ఆమె రూపొందించిన జబర్దస్త్ చిత్రం అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. మళ్లీ కొంత గ్యాప్ తీసుకుని ఆమె చేస్తున్న చిత్రం ‘కళ్యాణ వైభోగమే.’ నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై దామోదరప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధవౌతున్న సందర్భంగా నందినీరెడ్డి చెప్పిన విశేషాలు..
రియలిస్టిక్ స్టోరీ..
ప్రస్తుతం వున్న జనరేషన్‌లో పెళ్లి అంటే పెద్దగా విశేషంగా చెప్పుకోవడం లేదు. దాంతోపాటు విడాకులు, డేటింగ్‌లు వంటివి కూడా కామన్ అయిపోయాయి. పాతతరం వాళ్లు పెళ్లంటే ఏడు జన్మల బంధం అని, ఏ విషయంలోనైనా సర్దుకుని బతకాలని అనుకుంటారు. అలాంటి అంశంతో తీసిన సినిమా ఇది. ప్రస్తుతం ప్రేమించి పెళ్లిచేసుకున్నా కూడా నచ్చకపోతే వెంటనే బ్రేకప్ చేసుకుంటున్నారు. పెళ్లికి ముందు ఎలా వుంటున్నారు, పెళ్లయిన తర్వాత ఎలా వుంటున్నారు అనే అంశంతో తీసిన కథే ఇది. ఇదొక హ్యూమన్ స్టోరీ అని చెప్పొచ్చు.
గ్యాప్ రావడానికి కారణం
అలా మొదలైంది సినిమా నాకు నచ్చినట్టు తీశాను. ఆ సినిమా విజయంతో నాలో మరింత ఉత్సాహం పెరిగింది. రెండవ సినిమా జబర్దస్త్ మాత్రం జనాల్ని ఆకట్టుకోలేకపోయింది. దాంతో చాలా బాధపడ్డాను. ఆ తర్వాత ఎవరితో సినిమా చేయాలనే కన్‌ఫ్యూజన్‌లో కొంత టైమ్ తీసుకున్నాను. స్టార్ హీరోకంటే కూడా కథే ముఖ్యమనే భావనతో ఈ సినిమాను చేశాను.
నిర్మాత మారాడు
నిజానికి ఈ సినిమాను స్వప్నదత్ చేయాల్సింది. ఈ కథ ఆమెకే చెప్పాను. అదే టైమ్‌లో నాగశౌర్యకు కూడా చెప్పాను. నాగశౌర్యతో అంతకుముందే వాళ్లు సినిమా ప్లాన్ చేయడంతో నేనీ సినిమా చేయనని స్వప్న తప్పుకోవడంతో దామోదర్‌ప్రసాద్ ఎంటర్ అయ్యారు. కథ విన్నవెంటనే సినిమా చేద్దామని ప్రొసీడ్ అయ్యాం. నేను ఇప్పటివరకు చాలా కథలు ఎంతోమందికి చెప్పాను. నా కథల విషయంలో దామూ ఛాయిస్ ఒక్కటే.
చాలామంది రిజక్ట్ చేశారు
మొదట ఈ కథను ముగ్గురు హీరోలకు చెప్పాను. ఏవేవో కారణాలు చెప్పి వాళ్లు రిజక్ట్ చేశారు. కానీ కథ మీద నాకు నమ్మకం వుండడంతో ఇంకా వేరే హీరోలకోసం తిరిగాను. ఈ పాత్రకు నాగశౌర్య అయితే బెటర్ అని ఆయన్ను ఎంచుకున్నాను. సినిమా మొత్తం అద్భుతంగా వచ్చింది.
తదుపరి చిత్రాలు
నాకు హ్యూమన్ రిలేషన్స్‌పై సినిమాలు చేయడమే ఇష్టం. ఏ కథ తీసుకున్నా అందులో మానవ సంబంధాలు ఉండేలా చూసుకుంటాను. ప్రస్తుతానికి ఓ కథ సిద్ధంగా వుంది. అదొక సీరియస్ లవ్ స్టోరీ.

- యు