పోస్ట్ ప్రొడక్షన్‌లో ‘తుహిరే మేరీజాన్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూతన నటీనటులు వికాశ్, కళ్యాణి జంటగా దుర్గాదేవి ఫిలిమ్ మేకర్స్ పతాకంపై ఎన్.డి.ఉదయ్‌కుమార్ దర్శకత్వంలో కవనరెడ్డి నాగేశ్వరరావు రూపొందిస్తున్న చిత్రం ‘తుహిరే మేరీజాన్’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. త్వరలోనే విడుదల చేయడానికి సిద్ధంచేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఫిలిమ్ ఛాంబర్ హాలులో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు ఉదయ్‌కుమార్ మాట్లాడుతూ పూర్తి ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రం చిన్నదైనా అందరూ ఇష్టపడే చేశారని, ఈనెలలోనే ఆడియో విడుదల చేసి, మార్చిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. మంచి పాటలతో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు కొత్తగా అందించడానికి ప్రయత్నం చేశామని, కచ్చితంగా విజయవంతవౌతుందన్న నమ్మకం వుందని కథానాయకుడు వికాష్ తెలిపారు. స్నేహం, ప్రేమ, కుటుంబ విలువలు అన్నీ కలగలిపి ఈ చిత్రంలో తాను చేసిన పాత్ర అందరికీ నచ్చుతుందని, ఆరు పాటలతో రూపొందిన ఈ చిత్రం తనకు మంచి పేరు తెస్తుందని కథానాయిక కళ్యాణి అన్నారు. కార్యక్రమంలో రచయిత చాణక్య, డి.ఎమ్.కె. తదితరులు పాల్గొని చిత్ర విశేషాలు తెలిపారు. ఈ సినిమాకు సంగీతం: జోడాశాండీ, ఎడిటింగ్: రాజు లీలా, పాటలు: చాణక్య, నిర్మాత: కవనరెడ్డి నాగేశ్వరరావు, కథ, స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: ఎన్.డి.ఉదయ్‌కుమార్.

వంద గుర్రాలతో...సర్దార్

భారీ బడ్జెట్‌తో, భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ‘సర్దార్ గబ్బర్‌సింగ్’లో ప్రధాన పాత్రలో పవన్‌కళ్యాణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో హార్స్ మేళా సన్నివేశం సినిమాకు హైలెట్‌గా నిలవనుంది. ఇందుకోసం 100 గుర్రాలు, వందమంది జాకీలు, 40మంది ప్రధాన తారాగణంతోపాటుగా వెయ్యిమంది పాల్గొనగా మూడు యూనిట్లతో ఈ సన్నివేశాన్ని భారీగా చిత్రీకరించారు. గుర్రాలతోపాటు పాత కార్లను, కొత్త కార్లను కూడా ఈ సన్నివేశంలో ఉపయోగించడం విశేషం.
ఉత్తమ సాంకేతిక విలువలతో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్, బరోడా, రాజ్‌కోట్, కేరళ, మల్ షేట్స్ ఘాట్స్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో జరుగుతోంది. మార్చిలో ఆడియోను విడుదల చేసిన ఏప్రిల్ 8న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
శరత్‌కేల్కర్, బ్రహ్మానందం, అలీ, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, ముఖేష్‌రుషి, కబీర్‌సింగ్, కృష్ణ్భగవాన్, బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్, ఊర్వశి, రఘుబాబు, లక్ష్మీరాయ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరా: ఆర్థర్ విల్సన్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: బ్రహ్మకడలి, నిర్మాతలు: శరత్‌మరార్, సునీల్ లుల్ల, దర్శకత్వం: కె.రవీంద్ర (బాబీ).