దయ్యం ఇంట్లోనా, ఒంట్లోనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వీరి వీరి గుమ్మడిపండు చిత్రం అంతా హా రర్ జోనర్‌లోనే సాగుతుంది. విశ్రాంతికి ముందు ఇంట్లో దయ్యం ఉందని తెలుస్తుంది, సెకండాఫ్‌లో ఆ ఇంట్లోవున్న మనుషుల్లో ఒకరిలో దయ్యం వుందని తెలుస్తుంది. చివరికి ఏమైంది’ అన్న కథనంతో కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులకు నచ్చేటట్టుగా ఈ చిత్రాన్ని రూపొందించామని చిత్ర దర్శకుడు ఎం.వి. సాగర్ తెలిపారు. రుద్ర, వెనె్నల జంటగా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 26న విడుదలకు సిద్ధవౌతోంది. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలను తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, ఓ డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సాగుతూ హారర్ జోనర్‌లో ప్రేక్షకులకు థ్రిల్లింగ్ కలిగేలా ఈ చిత్రం సాగుతుందని, ఇంటర్వెల్ ఎపిసోడే ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుందని తెలిపారు. ఒక ఇంట్లో దయ్యం వుందని తెలిసిన తర్వాత ఆ ఇంట్లో ఎవరిలో దయ్యం వుందనే అంశమే విచిత్రంగా సాగుతూ థ్రిల్లింగ్ కలిగిస్తుందని, స్క్రీన్‌ప్లే హైలెట్‌గా సాగే ఈ చిత్రంలో దాదాపు 63 మంది కొత్త నటీనటులు పరిచయమయ్యారని ఆయన అన్నారు. కథ డిమాండ్‌ని బట్టి ప్యాడింగ్ ఆర్టిస్టులను తీసుకున్నామని ఆయన తెలిపారు. కథ విషయానికి వస్తే ఓ పదహారు మంది కుటుంబ సభ్యులతో ఆనందంగా వున్న ఓ కుటుంబం దయ్యం భయంతో ఎలా మారింది, వారి జీవితాల్లో ఎటువంటి మార్పులు జరిగాయి అనే కథాకథనంతో ఈ చిత్రం సాగుతుందని తెలిపారు. దర్శకత్వం నేర్చుకోడానికి తాను ఎవ్వరిదగ్గర పనిచేయలేదని, అంతా స్వతహాగానే నేర్చుకున్నదాంతో ఈ చిత్రాన్ని రూపొందించానని అన్నారు. సినిమాలో తొలి సగంలో ముందు 15 నిమిషాలు పాత్రల పరిచయం ఉంటుందని, ఆ తర్వాతే సినిమా కథ ప్రారంభవౌతుందని తెలిపారు. సినిమా చూసి బయటికి వచ్చే ప్రేక్షకుడు ఓ మంచి చిత్రాన్ని చూశానన్న వ్యాఖ్య చేస్తాడని, ఇప్పటికే కొంతమందికి ఈ చిత్రానికి సంబంధించిన ప్రివ్యూను వేసి చూపించామని, వారంతా థ్రిల్లర్ జోనర్‌లో కొత్తగా ఉందని, కామెడీ ఎంజాయ్ చేశామని తెలపడం ఆనందాన్నిస్తోందని ఆయన అన్నారు. గతంలో ప్రేమకథాచిత్రమ్, గీతాంజలి, రాజుగారి గది ఎంత విజయం సాధించాయో ఈ చిత్రం కూడా అంతే విజయం సాధిస్తున్న నమ్మకం వుందని ఆయన వివరించారు.

- యు