మానసిక సంఘర్షణల అంపశయ్య..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైనీ క్రియేషన్స్, ఓం నమో భగవతే వాసుదేవాయ ఫిలిమ్స్ పతాకంపై ప్రభాకర్ జైనీ దర్శకత్వంలో విజయలక్ష్మి జైనీ రూపొందిస్తున్న చిత్రం ‘అంపశయ్య’. సుప్రసిద్ధ రచయిత అంపశయ్య నవీన్ తీర్చిదిద్దిన ఏళ్లనాటి కథను సినిమా రూపంలో తెరకెక్కిస్తున్నారు. శ్యామ్‌కుమార్, పావని జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, నరసాపూర్ అడవులు, వరంగల్ రామప్ప గుడి, ఉస్మానియా యూనివర్సిటీ తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేశామని, అంపశయ్య నవలకు చిత్రానువాదం చేయడం సామాన్యమైన విషయం కాదని తెలిపారు. మానసిక సంఘర్షణలు, ఆలోచనలు తప్ప ఈ నవలలో సంఘటనలు లేకపోవడంతో తానే కొంత రాసుకున్నానని, శ్యామ్‌కుమార్ అనే వ్యక్తి రవి లాగే ఉన్నాడని, అందరూ మెచ్చుకున్నారని ఆయన తెలిపారు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి, విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు. స్వాతినాయుడు, మొగిలయ్య, యోగిదివాన్, వాల్మీకి, మోనికా థామ్సన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం: ప్రభాకర్ జైనీ.