అలాంటి పాత్రలు చేస్తుందట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పట్లో క్రేజీ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గ్లామర్ భామ ఛార్మీకి ఈమధ్య అవకాశాలు బాగా సన్నగిల్లాయి. ప్రస్తుతం చెప్పుకోదగ్గ సినిమాలు చేతిలో లేకపోవడంతో మరోవైపు తమిళ, కన్నడ భాషల్లో కూడా ప్రయత్నాలు సాగిస్తోంది. ఇప్పటికే చాలా చిత్రాల్లో నటించిన ఈమెకు ఇంకా కొన్ని తీరని కోరికలు ఉన్నాయట. అవి ఏంటంటే దశావతారంలో కమల్‌హాసన్ చేసినట్టు పది పాత్రలతో ఓ సినిమా చేయాలని కోరిక వుందట. దానికోసం ఎంత డేర్ అయినా చేస్తానని చెబుతోంది. అప్పట్లో అక్కినేని తొమ్మిది పాత్రలతో అలరించాడు. హాలీవుడ్‌లో ఎడ్డీమర్ఫీ ఏడు పాత్రలు చేసి ఆకట్టుకున్నాడు. అదే దారిలో తను కూడా ఇన్ని పాత్రలు ఒకే సినిమాలో చేయాలనుందని, ఏ నిర్మాత అయినా ముందుకు వస్తే ఫ్రీగా చేస్తానని చెబుతోంది. ఒకవేళ ఎవరూ చేయకపోయినా తానే నిర్మాతగా మారి ఈ ప్రయోగాన్ని చేస్తానని కాస్త గట్టిగానే చెబుతోంది. మొత్తానికి ఛార్మీకి తీరని కోరికలు చాలానే ఉన్నట్టున్నాయి. మరి ఈ దిశగా ఎవరు ప్రయత్నిస్తారో చూడాలి!