రైట్ రైట్ అన్న సునీల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుమంత్ అశ్విన్ కథానాయకుడుగా రూపొందిన ‘రైట్ రైట్’ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను నటుడు సునీల్ విజిల్ ఊది విడుదల చేశారు. శ్రీ సత్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మను దర్శకత్వంలో జె.వంశీకృష్ణ రూపొందించిన ఈ చిత్రంలో సుమంత్ అశ్విన్, పూజా జవేరి జంటగా నటిస్తున్నారు. మోషన్ పోస్టర్ విడుదల చేశాక సునీల్ మాట్లాడుతూ, ఎం.ఎస్.రాజు బ్యానర్‌లో ‘మనసంతా నువ్వే’ చిత్రంలో తాను ఫుల్‌లెంగ్త్ పాత్రలో నటించానని, ఆ పాత్రే తన కెరీర్‌కు బలమైన పునాదిగా నిలిచిందని తెలిపారు. సుమంత్ అశ్విన్ కూడా మంచి నటుడుగా ఎదగాలని, అలాగే ‘మర్యాదరామన్న’తో నటుడిగా ప్రవేశించిన ప్రభాకర్ కూడా ఈ చిత్రంతో విజయం సాధించాలని అన్నారు. సునీల్‌ను చిన్నప్పటినుంచి తాను చూస్తున్నానని, తన సినిమాకు సంబంధించిన పోస్టర్ ఆయన విడుదల చేయడం శుభసూచకమని నటుడు సుమంత్ అశ్విన్ అన్నారు. ఈనెల 22నుండి మార్చి 9 వరకు జరిగే షెడ్యూల్‌లో ఓ పాట మినహా సినిమా అంతా పూర్తవుతుందని, ఏప్రిల్‌లో పాటలను, మే సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత జె.వంశీకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో ప్రభాకర్ తదితరులు చిత్ర విశేషాలు తెలిపారు. నాజర్, ధన్‌రాజ్, షకలక శంకర్, తా.రమేష్, జీవా, రాజారవీందర్, భరత్‌రెడ్డి, వినోద్, పావని, కరుణ, జయవాణి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: జె.బి, పాటలు: శ్రీమణి, కెమెరా: శేఖర్ జోసెఫ్, మాటలు: డార్లింగ్ స్వామి, ఎడిటింగ్: ఎస్.బి.ఉద్ధవ్, నిర్మాత: జె.వంశీకృష్ణ, దర్శకత్వం: మను.్ప