లారెన్స్‌తో నాగభైరవ? నిర్మాత బండ్ల గణేశ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో పలు హిట్ చిత్రాల్ని నిర్మించి పెద్ద నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్ తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ప్రముఖ దర్శకుడు రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. తమిళనాడులో ‘గంగ’ సినిమాతో వంద కోట్ల మైలురాయిని చేరుకున్న లారెన్స్ రూపొందిస్తున్న మరో హారర్ ఎంటర్‌టైనర్ చిత్రమిది. భారీ గ్రాఫిక్స్‌తో తెరకెక్కే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రూపొందనుంది. పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కే ఈ సినిమా వివరాలను బండ్ల గణేష్ తెలియజేస్తూ, అగ్ర హీరోలతో హిట్ చిత్రాల్ని అందించిన ఈ బ్యానర్‌లో లారెన్స్‌తో సినిమా చేయడం ఆనందంగా వుందని, భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో హారర్, థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కే ఈ చిత్రానికి నాగభైరవ అనే టైటిల్ పరిశీలనలో వుందని, త్వరలో మిగతా వివరాలు ప్రకటిస్తామన్నారు.