26న వీరీ వీరీ గుమ్మడిపండు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుద్ర, సంజయ్, వెనె్నల ప్రధాన తారాగణంగా శివకృతి క్రియేషన్స్ పతాకంపై ఎం.వి.సాగర్ దర్శకత్వంలో కీలం కిరణ్‌కుమార్ రూపొందించిన చిత్రం ‘వీరీ వీరీ గుమ్మడిపండు’ (రచ్చరంబోలా). ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి, ఈనెల 26న విడుదలకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ఓ యధార్థ కథాకథనంతో రూపొందించిన ఈ చిత్రం హారర్ జోనర్‌లో సరికొత్తగా సాగుతుందని, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అందరికీ నచ్చుతుందని తెలిపారు. దయ్యం ఎవరిలో దాక్కున్నది అన్న కథాంశంతో థ్రిల్లింగ్‌గా సాగే ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని వారు తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 26న ప్రేక్షకుల ముందుకువస్తున్నామని, హారర్ జోనర్‌లో ఓ సరికొత్త ట్రెండ్‌ను సృష్టించడానికి ఈ చిత్రం వస్తోందని వారు తెలిపారు. పోసాని కృష్ణమురళి, రఘుబాబు, అనంత్, శివన్నారాయణ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఆర్.పి, ఎడిటింగ్: శక్తిస్వరూప్, నిర్మాత: కీలం కిరణ్‌కుమార్, రచన, దర్శకత్వం: ఎం.వి.సాగర్.