త్వరలో రాజుగారింట్లో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అజయ్ కీలక పాత్రలో భరత్ ఫిలిమ్ ఫ్యాక్టరీ పతాకంపై ఫిరోజ్ రాజా దర్శకత్వంలో భరత్‌కుమార్ పీలమ్ రూపొందించిన చిత్రం ‘రాజుగారింట్లో 7వ రోజు’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి, విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, నలుగురు దొంగలకు సంబంధించిన ఈ కథలో మంచి మెసేజ్ ఉందని, అందరూ మెచ్చే చిత్రం అవుతుందని చెప్పారు. హారర్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో నాలుగు అద్భుతమైన పాటలు ఉన్నాయని, టైట్ స్క్రీన్‌ప్లేతో సాగుతుందని వారు తెలిపారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని, యు/ఎ సర్ట్ఫికెట్ పొందామని, త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని వారు తెలిపారు. దయ్యాలు ఉంటాయా లేవా అనే విషయాన్ని కూడా ఈ చిత్రంలో చెప్పామని వారు తెలిపారు. భరత్, అర్జున్, వెంకటేష్, అక్షయ్, సుశ్మిత తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: క్రాంతి కె.కుమార్, సంగీతం: కనిష్క్, నిర్మాత: భరత్‌కుమార్ పీలం, రచన, దర్శకత్వం: ఫిరోజ్ రాజా.