సిద్ధమైన ‘జతగా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలయాళంలో విజయవంతమైన ‘ఉస్తాద్ హోటల్’ చిత్రాన్ని తెలుగులో ‘జతగా’ అనే పేరుతో అనువదించారు. దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని సురేష్ కొండేటి తెలుగులో అందిస్తున్నారు. అన్వర్ రషీద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన తొలి కాపీ సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ వచ్చే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, మలయాళంలో మ్యూజికల్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రంలో కథాకథనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు. లవ్ సెంటిమెంట్ పేద ధనిక వర్గాల మధ్య ఉండే బేధం, తదితర అంశాల సమాహారంగా రూపొందిన ఈ చిత్రం గుడ్‌ఫీల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిందని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, కెమెరా: ఎస్.లోకనాథన్, మాటలు: సాహితి, దర్శకత్వం: అన్వర్ రషీద్.