వైవిధ్యమైన గుప్పెడంత ప్రేమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయి రోనక్, అదితి సింగ్, ఐశ్వర్య ప్రధాన తారాగణంగా ఐవింక్ ప్రొడక్షన్స్ పతాకంపై వినోద్ లింగాల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం గుప్పెడంత ప్రేమ. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భభంగా దర్శకుడు వినోద్ మాట్లాడుతూ తొలి ప్రేమ నేపథ్యంలో హృదయానికి హత్తుకునే ఫీల్ గుడ్ మూవీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో తొలి ప్రేమ మరిచిపోని దశ అని, అలాంటి అందమైన ఓ మంచి కథనంతో రూపొందిస్తున్న ఈ చిత్రం ద్వారా కొత్త నటీనటులను పరిచయం చేస్తున్నామని, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా సాగే ఈ చిత్రంలోని ప్రతి పాత్ర ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుందని ఆయనన తెలిపారు. షిల్లాంగ్, చిరపుంజి, మేఘాలయలలో అందమైన ప్రదేశాల్లో షూటింగ్ చేసామని, హైదరాబాద్, గుంటూరు, వరంగల్‌లో కూడా కొంత టాకీపార్టు చిత్రీకరించామని ఆయన తెలిపారు. త్వరలో ఆడియోను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సంజయ్ లోక్‌నాధ్, పాటలు: శ్రీమణి, వనమాలి, సంగీతం: నవనీత్ సుందర్, ఆర్ట్: రాజీవ్ నాయక్. దర్శకత్వం:వినోద్ లింగాల.