రామ్‌చరణ్ చిత్రం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌చరణ్ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్న చిత్రం గురువారం
హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. తమిళంలో ఘన విజయం సాధించిన ‘తనివొరువన్’ చిత్రానికి రీమేక్‌గా రూపొందే ఈ భారీ చిత్రాన్ని ఈ నెల 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపనున్నారు. ఈ చిత్రంలో కీలక పాత్రలో ప్రముఖ నటుడు అరవింద్ స్వామి నటిస్తున్నారు. రామ్‌చరణ్ సరసన మరోసారి రకుల్ ప్రీత్‌సింగ్ జోడీ కడుతున్నారు. ఈ సినిమా గురించి నిర్మాత వివరాలు తెలియజేస్తూ, ‘ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఈ రోజు లాంఛనంగా ప్రారంభించి, 22 నుంచి ఏకధాటిగా షూటింగ్ జరుపనున్నాం. తమిళంలో 100 కోట్ల మార్కెట్‌ను సాధించిన ‘తనివొరువన్’ చిత్రాన్ని భారీ స్థాయిలో తెర కెక్కిస్తున్నాం’ అన్నారు. రకుల్ ప్రీత్‌సింగ్, అరవింద్ స్వామి, నాజర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా అసీం మిశ్రా, సంగీతం హిప్ హాప్’ ఆది, ఆర్ట్ నాగేంద్ర, ఎడిటింగ్ నవీన్ నూలి,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వి.వై.ప్రవీణ్ కుమార్, కోప్రొడ్యూసర్ ఎన్.వి.ప్రసాద్,
నిర్మాత అల్లు అరవింద్, దర్శకత్వం: సురేందర్‌రెడ్డి.