గ్లామర్‌పైనే శ్రద్ధ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పుడు హీరోయిన్ల దారి మొత్తం గ్లామర్‌వైపే మళ్లింది. ఎవరు ఎంత ఎక్కువగా అందాలను ఆరబోస్తే వారికే అవకాశాలు వచ్చి పడుతున్నాయి. లేదూ, నేను ఇలాగే వుంటానంటే ఇండస్ట్రీలో మనుగడ కష్టమే. ఈ విషయం ఇప్పటి హీరోయిన్లందరికీ బాగా తెలిసిందే. తాజాగా గ్లామర్‌ను ఆరబోసేందుకు మాగ్‌జైన్ ఫొటో షూట్లతో రెచ్చగొడుతున్నారు కూడా. అసలు విషయం ఏమిటంటే, ‘ఆషికి-2’ సినిమాతో సంచలనం సృష్టించి ఆ సినిమాతో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న శ్రద్ధాకపూర్. శక్తికపూర్ కూతురైన ఈ భామ, ఆ సినిమా తరువాత బోలెడన్ని అవకాశాల్ని కొట్టేసింది. కానీ, అందులో ఏ సినిమా కూడా కెరీర్ పరంగా సరైన బ్రేక్‌ను ఇవ్వలేకపోయింది. దాంతో అవకాశాలు సన్నగిల్లాయి. ఇక లాభం లేదనుకుని ఇప్పుడు ఈ భామ కూడా హాట్ హాట్‌గా మాగజైన్ల ఫొటో షూట్‌లకు ఫోజులిస్తూ క్రేజ్ పెంచుకుంటోంది. తాజాగా ఓ పత్రిక కోసం రెచ్చిపోయి ఫోజులిచ్చింది. ఇప్పుడు ఈ గాలి సౌత్‌కు కూడా మళ్లింది.