మార్చిలో ఊపిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జున, కార్తి, తమన్నా ముఖ్యపాత్రల్లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పి.వి.పి సినిమా పతాకంపై పరం వి.పొట్లూరి, కవిన్ అనె్న నిర్మిస్తున్న భారీ చిత్రం ‘ఊపిరి’. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర వివరాలను నిర్మాత తెలియజేస్తూ ఫ్రాన్స్, బల్గేరియా, స్లోవేనియా వంటి ప్రాంతాల్లో ఇప్పటివరకూ ఎవరూ షూట్ చేయని లొకేషన్లలో ఈ చిత్రాన్ని చిత్రీకరించామని, షూటింగ్ మొత్తం పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. నాగార్జున కెరీర్‌లో ఈ చిత్రం నిలిచిపోతుందని, తమిళ నటుడు కార్తి తెలుగులో చేస్తున్న మొదటి చిత్రం ఇదని, తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మార్చిలో భారీ స్థాయిలో విడుదల చేస్తామన్నారు. దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ, ఇద్దరు వేర్వేరు వ్యక్తులమధ్య ఏర్పడిన స్నేహం, తద్వారా జరిగే ఎమోషనల్ జర్నీ ప్రధానాంశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, ఇటీవలే విడుదలైన ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన వచ్చిందని, నాగార్జున, కార్తి అద్భుతంగా నటించారని, తమన్నా నటన, గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. అన్ని రకాల ప్రేక్షకులు ఆకట్టుకునే సినిమా ఇది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:గోపీసుందర్, ఎడిటింగ్:మధు, కెమెరా:పి.ఎస్.వినోద్, మాటలు:అబ్బూరి రవి, సమర్పణ:పెరల్ వి.పొట్లూరి, నిర్మాతలు:పరం వి.పొట్లూరి, కవిన్ అనె్న, దర్శకత్వం:వంశీ పైడిపల్లి.