గ్యారేజ్ పనులు మొదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంక్రాంతికి ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు తన తదుపరి చిత్రంపై దృష్టిపెట్టాడు. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ చిత్రాల క్రేజ్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రం ఫిబ్రవరి మొదటివారంలో సెట్స్‌పైకి రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ మొదలు కాకముందే బిజినెస్ విషయంలో సంచలనం సృష్టిస్తోంది. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాతో ఓవర్‌సీస్‌లో క్రేజీ మార్కెట్‌ను స్వంతం చేసుకున్న ఎన్టీఆర్‌కు ఈ సినిమా దానికి రెట్టింపు మొత్తంలో బిజినెస్ జరిగిందని తెలిసింది. మరోవైపు ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో భారీ సెట్టింగులు నిర్మిస్తున్నారు. ‘జనతా గ్యారేజ్’ పేరుతో తెరకెక్కే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది తెలియాల్సి వుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మరో కొత్త లుక్‌లో కన్పిస్తాడట. ఈ చిత్రంలో మరో ముఖ్యపాత్రలో ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్ తనయుడు ముకుందన్ నటిస్తాడని తెలిసింది. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.