ఎలా వస్తాయో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాను ‘్ఫతూర్’ చిత్రంలో కేవలం హెయిర్ స్టైలింగ్ కోసమే 55 లక్షలు నిర్మాతతో ఖర్చుపెట్టించానని, రెడ్ కలర్‌లో వున్న జుట్టును విరబూయించడానికి స్క్రీన్‌పై అది అందంగా కనపడడానికి ఎంతో కష్టపడ్డానని కథనాలు వింటున్నానని, అవన్నీ వింటుంటే నవ్వు వస్తోందని అంటోంది బాలీవుడ్ అందాల నటి కత్రినా కైఫ్. స్క్రీన్‌పై అందంగా కనపడడానికి కష్టపడ్డాను అన్నదాంట్లో నిజం వుందేమోకానీ, కేవలం హెయిర్ స్టైలింగ్ కోసమే 55 లక్షలు ఖర్చుపెట్టానంటే మాత్రం నమ్మశక్యంగా లేదని, అసలు ఇలాంటి పుకార్లు ఎలా వస్తాయో, ఎవరు నమ్ముతారో కూడా తెలియదంటోంది ఆమె. అలా 55 లక్షలు ఖర్చుచేసి నా హెయిర్ స్టైల్ చేస్తే చూడాలని నాకూ వుందని చమత్కరించింది. అయినా అలా ఖర్చుపెట్టించడానికి మనమెవరం? సినిమా డిమాండ్‌ను బట్టి ఏ నిర్మాత అయినా ఖర్చుపెడతాడు అంటూ సన్నాయి నొక్కులూ నొక్కింది.