మరో భారీ చిత్రం తీస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీఆర్, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా సుకుమార్ దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర సినీ క్రియేషన్స్ పతాకంపై ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాన్ని నిర్మించారు నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై మంచి టాక్‌తోపాటు భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సందర్భంగా నిర్మాత భోగవల్లి ప్రసాద్ చెప్పిన విశేషాలు...
‘సంక్రాంతికి విడుదలైన మా చిత్రం మంచి టాక్ తెచ్చుకోవడంతోపాటు వసూళ్లపరంగా కూడా బాగా రాబట్టింది. ఓ మంచి కథతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా సుకుమార్ అద్భుతంగా తెరకెక్కించిన చిత్రమిది. ఓ తండ్రి కోసం కొడుకు పడే తపనే ఈ సినిమా. ఎన్టీఆర్ ఇందులో కొత్తగా కన్పించడంతోపాటు అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా కుటుంబ సభ్యులందరూ చూసే చిత్రంగా వుందని అందరూ అభినందిస్తున్నారు. మొదట్లో కథ చెప్పినపుడే బాగా నచ్చడంతో ఈ సినిమాను నిర్మించాను. సుకుమార్‌తో ఇదివరకే ‘ఆర్య-2’ చిత్రాన్ని నిర్మించాను. సుకుమార్‌లో మంచి టెక్నీషియన్ వున్నాడు. చెప్పే కథను కొత్తగా చెప్పగల దర్శకుడు అతను. అతని గత సినిమా హిట్ ఫ్లాప్‌ల గురించి కాకుండా తనలోని టాలెంట్‌ను నమ్మి తీసిన సినిమా ఇది. నేను ముందు కాంబినేషన్లకే ప్రాధాన్యత ఇస్తాను. ఆ తరువాత కథకు. ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం విడుదలైన రెండు వారాల్లో 50 కోట్ల షేర్ సాధించడం ఆనందంగా వుంది. ముఖ్యంగా ఓవర్‌సీస్‌లో భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో మరో రెండు మూడు ప్రాజెక్టులకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. మళ్లీ ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాము. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు తెలియజేస్తా అన్నారు.