కథ పాతదే.. కొత్తగా ప్రెజెంట్ చేశా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌తరుణ్, అర్తన జంటగా శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ చిత్రం ఈనెల 29న విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతోంది.
ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు శ్రీనివాస్ గవిరెడ్డి. ఈ చిత్రం సక్సెస్‌ఫుల్ రన్ అవుతున్న సందర్భంగా శ్రీనివాస్ గవిరెడ్డి చెప్పిన విశేషాలు...
మంచి రెస్పాన్స్
గ్రామీణ నేపథ్యంలో వుండే సినిమా కావడంతో ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంది. ప్రతీ అబ్బాయి జీవితంలో ఒక అమ్మాయి వుంటుంది. ఆ అమ్మాయి కోసం తను ఇష్టంగా వుంచుకున్న గోల్‌ను వదిలేసిన యువకుడి కథ ఇది. కథ పాతదే అయినా కొత్తగా చెప్పాలని ట్రై చేశా.
రాజ్‌తరుణ్ కోసమే
ఈ కథను రాజ్‌తరుణ్‌ని దృష్టిలో పెట్టుకుని రాశాను. సినిమా చూసిస్తా మావ సినిమా సమయంలో తనకి ఈ కథ చెప్పాను. తనకు బాగా నచ్చడంతో దీన్ని డెవలప్ చేశాం. సినిమా పట్ల రాజ్‌తరుణ్ చాలా హ్యాపీగా వున్నాడు. అలాగే ప్రొడ్యూసర్స్ కూడా ఆనందంగా వున్నారు.
నా గురించి
నేను నర్సీపట్నం దగ్గర బైవరం ఊరు. చిన్నప్పటినుంచీ సినిమాలంటే పిచ్చి. అందరిలాగే డిగ్రీ తరువాత ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్ వచ్చేశాను. ఇక్కడ చాలా కష్టాలు పడ్డాను. 2007లో నగరం సినిమాకు అసిస్టెంట్‌గా పనిచేశా. ఆ తరువాత దర్శకుడు మదన్ దగ్గర పనిచేశాను. అలాగే అల్లు అర్జున్ దగ్గర సంవత్సరంపాటు వున్నా. ఆయన ఎంతో ప్రోత్సాహం అందించారు.
తదుపరి చిత్రాలు
ప్రస్తుతానికి రెండు కథలు రెడీగా వున్నాయి.