అవార్డులు ముఖ్యం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది
అందాల భామ శ్రుతిహాసన్. లెజెండరీ నటుడు కమల్ నట వారసత్వాన్ని
అందిపుచ్చుకున్నా కూడా ఆమె తనదైన ఇమేజ్‌తో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. మరోవైపు అడపాదడపా హిందీలో కూడా నటిస్తున్న ఈ భామకు టాలీవుడ్‌లో మంచి క్రేజ్ వుంది. మహేష్ సరసన నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రం ఘనవిజయం సాధించడంతో శృతికి తెలుగులో అవకాశాలు ఎక్కువయ్యాయి. ప్రస్తుతం ‘ప్రేమమ్’ రీమేక్‌లో నటిస్తున్న ఈ భామ సూర్య ‘సింగం-3’లో కూడా నటిస్తోంది. ఇటీవలే రేసుగుర్రం చిత్రంలో నటించినందుకుగాను ఫిలింఫేర్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె తన అభిప్రాయాలు
తెలియజేస్తూ ‘శ్రీమంతుడు చిత్రానికి ఐఫా అవార్డులు రావడం ఆనందంగా వుంది. అలాగే ఫిలింఫేర్ అవార్డు కూడా, అయినా మనం ఇష్టపడి చేసే సినిమాలకు అవార్డులు రావడం సంతోషంగానే వుంటుందికానీ, అవార్డులకంటే కూడా
ప్రేక్షకుల అభిమానమే ముఖ్యం’ అని చెబుతోంది.