సెన్సార్ విధానాన్ని రద్దు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పటికప్పుడు కావలసిన సమాచారం అందుబాటులో ఉంటున్న ఈ రోజుల్లో సెన్సార్ విధానం అసంబద్ధమైనదని, కాలం చెల్లిన సెన్సార్‌బోర్డును రద్దు చేయాలని ప్రఖ్యాత దర్శక, నిర్మాత రామ్‌గోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు. జేమ్స్‌బాండ్ సినిమా ‘స్పెక్టర్’లో ముద్దు సన్నివేశం నిడివిని కుదించాలన్న సెన్సార్‌బోర్డు అధ్యక్షుడు పహలాజ్ నిహలానీ నిర్ణయంపై దేశంలో ఆగ్రహం వ్యక్తం అవుతున్నవేళ వర్మ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. నిహలానీ, సెన్సార్‌బోర్డు నిబంధనల చట్రంలో ఇలాగే పనిచేస్తున్నట్టయితే లాభంలేదని అన్నారు. ఎవరైనా ఇష్టపడినప్పుడు, తమతమ సెల్‌ఫోన్లలో అశ్లీల దృశ్యాలను వీక్షించగలిగే వీలున్న నేటి డిజిటల్ ప్రపంచంలో, నలుగురైదుగులు కూర్చుని దేశంలోని ప్రజలు ఏంచూడాలో, ఏది చూడకూడదో నిర్ణయించడంలో అర్థంలేదని ఆయన అన్నారు. నిబంధనల చట్రంలో ఇరుక్కుని పనిచేయడంకన్నా సెన్సార్ విధానాన్ని రద్దుచేయడమే మంచిదని వ్యాఖ్యానించారు.
ఒక చిత్రంలోని ఒకే సన్నివేశాన్ని సెన్సార్‌బోర్డు సభ్యుల బృందాలు వేర్వేరుగా పరిశీలించినపుడు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేసిన సంఘటనలను, సెన్సార్‌బోర్డు నిర్ణయాలను న్యాయస్థానాలు తప్పుబట్టిన ఉదంతాలను వర్మ ఈ సందర్భంగా ఉటంకించారు. సత్య, బండిట్‌క్వీన్ సినిమాలకు సంబంధించి సెన్సార్‌బోర్డు నిర్ణయాలకు విరుద్ధంగా ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును ఆయన ఉదహరించారు. మన ప్రభుత్వాలు అమలుచేస్తున్న సెన్సార్ విధానాలు కాలంచెల్లినవని ఆయన అన్నారు.