రుద్రాక్షలో సమంత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రియేటివ్ దర్శకుడిగా తెలుగు తెరపై తిరుగులేని గుర్తింపును తెచ్చుకున్న కృష్ణవంశి ‘గోవిందుడు అందరివాడేలే’ తరువాత కొంత గ్యాప్ తీసుకుని మరో చిత్రాన్ని సన్నాహాలు మొదలుపెట్టాడు. ఈసారైనా లేడీ
ఓరియెంటెడ్ చిత్రాన్ని తెరకెక్కిస్తాడని అంటున్నారు. ప్రముఖ
నిర్మాత దిల్‌రాజు నిర్మించే ఈ చిత్రానికి ‘రుద్రాక్ష’ అనే టైటిల్‌ను
పెడుతున్నట్లు తెలిసిందే. థ్రిల్లర్ అంశాలతో ఆసక్తికరంగా తెరకెక్కే
ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనే విషయంపై ఆసక్తి నెలకొంది. మొదట్లో ఈ చిత్రంలో అనుష్క నటిస్తుందని అనుకున్నారు. కానీ ఇప్పుడామె వేరే సినిమాలతో బిజీగా వుండడంతో ఈ సినిమా చేయలేనని చెప్పింది. దాంతో ‘రుద్రాక్ష’ సినిమాలో సమంత నటిస్తుందని
వార్తలొస్తున్నాయి. ఈ సినిమాపై సమంత కూడా ఆసక్తిగానే వున్నట్టు తెలుస్తోంది. కృష్ణవంశీ సినిమా అంటేనే కొత్తదనం వుంటుందని,
ఆయనతో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తే తన కెరీర్‌కు ఖచ్చితంగా ప్లస్ అవుతుందని భావిస్తుందట సమంత. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడికానున్నాయి.