బోయపాటితో రామారావుగారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ సంక్రాంతికి తన 99వ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ. ఆయన నటించిన ‘డిక్టేటర్’ చిత్రం ప్రేక్షకులకు ముఖ్యంగా నందమూరి అభిమానులకు బాగా నచ్చింది. ఈ సినిమా తరువాత ఆయన వందో చిత్రం కోసం సన్నాహాలు మొదలుపెట్టాడు. ఇప్పటికే ప్రముఖ సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ‘ఆదిత్య 999’ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తికావచ్చింది. ఇదిలా వుండగా మరో ఆసక్తికరమైన వార్త ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. బాలకృష్ణ కెరీర్‌లో భారీ విజయాలను అందించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో చిత్రం రూపొందించేందుకు బాలకృష్ణ సన్నాహాలు చేస్తున్నారని అంటున్నారు. ‘సింహ’, ‘లెజెండ్’ సినిమాలతో ఘనవిజయాలను అందుకున్న ఈ కాంబినేషన్‌లో ఇప్పుడు హ్యాట్రిక్ హిట్‌కోసం ప్రయత్నం సాగిస్తున్నారు. మరోవైపు బోయపాటి శ్రీను రూపొందిస్తున్న ‘సరైనోడు’ చిత్రం పూర్తికావచ్చింది. దీనితరువాత బాలకృష్ణతో బోయపాటి సినిమా చేయడానికి రెడీగా వున్నాడని, ఇప్పటికే ఈ సినిమాకు ‘రామారావుగారు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ప్రముఖ నటుడు నందమూరి తారకరామారావు పేరుతో ఆయన తనయుడు సినిమా చేస్తారని ఇపుడు ఆసక్తికరంగా మారింది. బాలయ్య ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న తన వందో చిత్రం, బోయపాటి చిత్రాల్లో చిత్రాల్లో ఏది సెట్స్‌పైకి వస్తుందో చూడాలి!