అయోమయ స్థితిలో తెలుగు సినిమా --- రచయిత కోన వెంకట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘శంకరాభరణం’ సినిమాకు బిహార్ బ్యాక్‌డ్రాప్ కొత్తగా ఉందని సినిమా చేశాం. ప్రయోగంగా చేసిన ఈ సినిమా మంచి ఫలితాన్ని ఇస్తే ఇలాంటి కథలతో మరిన్ని సినిమాలు చేయవచ్చు అని అంటున్నారు ప్రముఖ రచయిత కోనవెంకట్. తెలుగు తెరపై నవ్వులపూలు పూయించి కమర్షియల్ సినిమాల రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన రచయితకు స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టారు. రచయితగా ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా సినిమాలను రూపొందిస్తున్నారు. తాజాగా ఆయన సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘శంకరాభరణం’. నిఖిల్, నందిత జంటగా ఉదయ్ నందనవనం దర్శకత్వంలో ఎమ్‌వివి సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం డిసెంబర్ 4న విడుదల అవుతున్న సందర్భంగా రచయిత కోన వెంకట్‌తో ముఖాముఖి.
శంకరాభరణం టైటిల్ పెట్టడానికి కారణం?
ఈ సినిమా బీహార్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. కొత్త టైటిల్‌కంటె ప్రేక్షకులకు బాగా తెలిసిన టైటిల్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ టైటిల్ పెట్టాం. నిజానికి ఎలాంటి జస్ట్ఫికేషన్ లేకుండానే టైటిల్ అనుకున్నాం. కానీ టైటిల్‌కి తగ్గట్టుగా జస్ట్ఫికేషన్ చేసుకుంటూ వచ్చాం.
మరి విశ్వనాధ్ గారు
అభ్యంతరం చెప్పలేదా?
‘గీతాంజలి’ తర్వాత మేం చేస్తున్న సినిమా ఇది. ఈ టైటిల్ అనుకున్నప్పుడు వెంటనే విశ్వనాధ్‌గారిని కలిసి చెప్పాను. ఆయన కారణం లేకుండా నువ్వలా పెట్టవని నాకు తెలుసని అన్నారు. దాంతో థైర్యంగా ముందుకు వెళ్లాం.
నిఖిల్‌తో చేయడానికి కారణం?
నిజానికి ఈ కథ పెద్ద హీరోలతో కూడా చేయవచ్చు. కానీ స్టార్ హీరోలకు ఉండే ఇమేజ్ వల్ల కథ చెప్పడం సరిగా ఉండదని నిఖిల్‌తో చేసాం. నిఖిల్ కూడా విభిన్నమైన సినిమాలతో దూసుకుపోతున్నాడు. అందుకని అతన్ని ఎంచుకున్నాం. ఖచ్చితంగా నిఖిల్‌కు ‘శంకరాభరణం’ ఓ ‘దూకుడు’ సినిమాలా నిలిచిపోతుంది.
ఇంతకీ కథేమిటి?
హీరో తండ్రి ఫారిన్‌లో చాలా కష్టపడి డబ్బు సంపాదిస్తాడు. తంఢ్రి కష్టపడ్డాడు కదా తానెందుకు కష్టపడాలి, సుఖపడాలి అనుకునే కొడుకు కథ ఇది. ఈ సినిమాలో నిఖిల్ గౌతమ్ అనే పాత్రలో నటించాడు. గౌతమబుద్ధునికి జ్ఞానోదయం అయిన ప్రాంతం బీహార్‌లోని గయ. అందుకే ఈ పాత్రకు ఆ పేరు పెట్టాం. మిగతా కథ సినిమాలో చూస్తే మీకే తెలుస్తుంది.
హీరోయిన్ల గురించి?
చిత్రంలో హీరోయిన్‌గా నందిత బీహారీ అమ్మాయి పాత్రలో కనిపించనుంది. ఈ పాత్ర సరదాగా ఉంటూనే కాస్త ఎమోషనల్‌గా మారిపోతుంది. ఈ పాత్రకు నందిత అయితేనే కరక్ట్ అని ఆమెతో చేయించాము. ఆమె బాగా చేసింది. మరో పాత్రలో అంజలి నటించింది. ఇందులో అంజలి హీరోయిన్ కాదు, విలన్ పాత్రలో కనిపిస్తుంది. ఒక్కొక్కప్పుడు హీరోయిన్‌లు శ్రీదేవి, విజయశాంతి ఇద్దరూ గ్లామర్ పాత్రలు చేస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించేవారు. అలాగే అంజలి కూడా ఈ సినిమాలో అలాంటి పాత్ర చేసింది. తనకు మంచి పేరు తెస్తుంది.
ఈ సినిమా ప్రయోగం అంటున్నారు. కారణం?
ఈ సినిమా కొత్త నేపథ్యంలో సాగుతుంది. నేను ఇదివరకు చేసిన ‘గీతాంజలి’ సినిమా కూడా కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈ కథ పుట్టడానికి కారణం ఓ హిందీ సినిమా చేసేటప్పుడు బీహార్‌లోని బీర్గంజ్ అనే ప్రాంతానికి వెళ్లాను. అక్కడ కిడ్నాప్ అనేది వాళ్ల మేజర్ బిజినెస్. పోలీసులు వచ్చేలోపు పక్కదేశానికి పారిపోతుంటారు. అక్కడ ముఖ్యమైన వ్యక్తులు, వస్తువులు ఒకటే. కిడ్నాప్ చేసేస్తారు. ఈ ముఠాల వెనుక ఎందరో రాజకీయ నాయకులు ఉన్నారని తెలసుకుని షాకయ్యా. ఆ ఆలోచనతోనే పస్‌గయా ఒబామా సినిమా చూసి అందులో ఆసక్తికరమైన పాయింట్ తీసుకుని దీన్ని రూపొందించాను.
దర్శకుని గురించి?
దర్శకుడు ఉదయ్‌తో నాది పదేళ్ల జర్నీ. తానయితే ఈ కథకు న్యాయం చేయగలడని అనిపించింది. దర్శకుడికి చాలా బాధ్యతలుంటాయి. అవన్నీ దగ్గరుండి చూసుకోవాలి. కాబట్టి ఉదయ్ ప్రతి విషయంలో ఎంతో జాగ్రత్తగా రూపొందించారు.
ఈమధ్య శ్రీనువైట్లతో మీకు మనస్పర్ధలు
వచ్చాయని తెలిసింది?
నిజమే. నాకు శ్రీనువైట్లకు మధ్య మనస్పర్ధలు ఉన్నాయి. ఎంత మంచి రిలేషన్ ఉన్నా గొడవలు రావడం సహజమే. నేను కొంచెం ఎమోషనల్ అయ్యాను. అయితే రేపు మళ్లీ కలవచ్చు. నిజానికి బ్రూస్లీ సినిమాకు 72 సీన్లు రాసిచ్చాను. నేను రాసిచ్చిన సీన్లను అలాగే తీయాలనే రూలేం లేదు. మార్చిన దానికి రచయితగా నా పేరు వేయడంతో కాస్త ఫీలయ్యాను. ‘దూకుడు’ సినిమా తర్వాత మా కాంబినేషన్‌లోసినిమా రావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
ప్రస్తుతం ఇండస్ట్రీలో పరిస్థితులు ఎలా ఉన్నాయి?
తెలుగు సినిమా పరిశ్రమ ప్రస్తుతం అయోమయ స్థితిలో ఉంది. ఒకప్పుడు బాలీవుడ్‌లో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినపుడు వాళ్లు మల్టిప్లెక్స్, ఓవర్‌సీస్ బిజినెస్ కోసం సినిమాలు తీయడం మొదలుపెట్టారు. దాంతో బి, సి సెంటర్లలో సినిమాలు కరువయ్యాయి. ఆ సమయంలో భోజ్‌పురి సినిమాకు మార్కెట్ ఏర్పడింది. ఇప్పుడు మనమదే పరిస్థితిలో ఉన్నాం. మనం చేస్తున్న సినిమాలు బి,సి సెంటర్లను దృష్టిలో పెట్టుకుని సినిమా చేయాలా లేదా మల్టీప్లెక్స్ సినిమాలు చేయాలా అనే ఆలోచనలో ఉంది.
తదుపరి చిత్రాలు?
ప్రస్తుతం రచయితగా ‘డిక్టేటర్’, నాగచైతన్య ‘సాహసం శ్వాసగా సాగిపో’, గోపీచంద్ ‘సౌఖ్యం’ చిత్రాలకు పని చేస్తున్నాను. ఇక నా ప్రొడక్షన్‌లో ఏడాదికి మూడు సినిమాలు చేస్తా.

-శ్రీ