గాడిలోపడనున్న మరుదనాయగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ నటుడు కమల్ తన డ్రీమ్ ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించడంకోసం రంగంలోకి దిగుతున్నాడు. గతంలో ఆర్థికపరమైన సమస్యల కారణంగా ఆగిపోయిన ‘మరుదనాయగం’ సినిమాను తిరిగి పూర్తి చేయనున్నాడు. దాదాపు 18 సంవత్సరాల క్రితం కమల్ ‘మరుదనాయగం’ అనే చారిత్రక చిత్రానికి శ్రీకారం చుట్టాడు. కథ.. కథనాలు రెడీ చేసుకుని, తనే టైటిల్ రోల్‌ను పోషిస్తూ దర్శకత్వం వహించాడు. భారీ బడ్జెట్‌తో అప్పట్లో ఈ సినిమా కొంతవరకు నిర్మాణం జరిగాక ఆర్థికపరమైన కారణాలవలన ఆగిపోయింది. అప్పటినుంచి ఈ సినిమాను పూర్తిచేయడానికి కమల్ ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే వున్నాడు. తాజాగా.. ఆ ప్రయత్నాలు ఫలించే సమయం ఆసన్నమైనట్టు తెలుస్తోంది. రెండు భారీ చిత్ర నిర్మాణ సంస్థలు ఈ సినిమా నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాయనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. అయింగరన్ నిర్మాణ సంస్థ ‘మరుదనాయగం’ సినిమా
పోస్టర్‌ను ట్విట్టర్‌లో పోస్ట్‌చేయడంతో ఈ సినిమా తిరిగి సెట్స్‌పైకి వెళుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.