ఇదొక భావోద్వేగ పాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నాన్నకు ప్రేమతో.. చిత్రం ఓ బొమ్మ అయితే, దేవిశ్రీ తన సంగీతంతో దానికి ప్రాణం పోశాడు. నా జీవితంలో ఓ భావోద్వేగమైన పాటగా ఇది నిలిచిపోతుంది. నాన్నకు ప్రేమతో టైటిల్ పాట అనుభూతిని మిగిల్చింది’ అని నటుడు ఎన్టీఆర్ తెలిపారు. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర ఎల్.ఎల్.పి పతాకంపై ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్‌లో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ రూపొందించిన చిత్రం ‘నాన్నకు ప్రేమతో’ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌సాంగ్ విడుదల హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రం గూర్చి ఎన్టీఆర్ మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ దేవిశ్రీప్రసాద్ తండ్రి సత్యమూర్తి, దేవితో ఇంత మంచి పాట రాయించారని, తాను అనుకుంటున్నానని, క్లైమాక్స్‌లో వచ్చే పాటకోసం ప్రేక్షకులు థియేటర్లలోనే వుండిపోతున్నారని అన్నారు. కథానాయకిగా నటించిన రకుల్‌ప్రీత్‌సింగ్ తన డబ్బింగ్ తానే చెప్పుకొని వర్క్‌పై డెడికేషన్‌ను చూపిందని, తమ కష్టానికి తగ్గ ఫలితం వచ్చిందని తెలిపారు. రాజేంద్రప్రసాద్ తండ్రిగా ఆ పాత్రకు ప్రాణం పోశారని, అదే విధంగా జగపతిబాబు విలన్‌గా చక్కగా నటించారని, ఇంత మంచి వైవిధ్యమైన చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు నమస్కరిస్తున్నానన్నారు. ఈ సినిమా షూటింగ్ ఆఖరురోజు దేవిశ్రీప్రసాద్ ఈ పాటను కంపోజ్ చేశారని, ఈ పాటని వారి తండ్రికి అంకితమివ్వడం ఆనందంగా వుందని, దర్శకుడు సుకుమార్ అన్నారు. ఎన్టీఆర్ లేకపోతే ఈ సినిమా లేనే లేదని, సినిమా అంటే ఫ్యాషన్ ఉన్న వ్యక్తి నిర్మాత అవ్వడంతో తమకు ప్లస్ అయిందని ఆయన అన్నారు. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ మొదట దగ్గరయ్యేది తల్లికైతే, నాన్న ఎమోషన్లకు పిల్లలు దగ్గరవుతారని, ఇంత ఎమోషనల్ సినిమాలో ఎక్కడా డ్రాబ్యాక్ లేకుండా తీసి, కమర్షియల్‌గా హిట్ సాధించిన సుకుమార్‌కు థ్యాంక్స్ చెబుతున్నానని దేవిశ్రీప్రసాద్ అన్నారు. కార్యక్రమంలో విజయ్ కె.చక్రవర్తి, రకుల్‌ప్రీత్‌సింగ్, రాజేంద్రప్రసాద్, నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ పాల్గొన్నారు.