అలరించే కళావతి పాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్ధార్థ్, త్రిష, హన్సిక ప్రధాన తారాగణంగా సర్వంత్ రామ్ క్రియేషన్స్, గుడ్ సినిమా గ్రూప్ పతాకాలపై అందిస్తున్న చిత్రం ‘కళావతి’. తమిళంలో ‘అరన్మణి-2’గా విడుదలైన ఈ చిత్రానికి దర్శకుడు సుందర్ సి. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో హైదరాబాద్‌లో ఆదివారం ఉదయం దిల్‌రాజు విడుదల చేసి, తొలి కాపీని సుందర్ సికి అందించారు. ఈ సందర్భంగా దర్శకుడు సుందర్.సి మాట్లాడుతూ చంద్రకళగా పెద్ద విజయం సాధించిన ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని మొదట అనుకోలేదని, అయితే ఆ సినిమా ముగింపులో బంగ్లాలో దయ్యం ఉన్నట్లు చూపించాం కనుక చాలా మంది సీక్వెల్ చేస్తున్నారా? అని అడగడంతో ఆ వైపున ఆలోచించి ఈ చిత్రాన్ని మొదటి భాగం కన్నా భారీగా తెరకెక్కించామని తెలిపారు. మంచి కథతో, భారీ బడ్జెట్‌తో దీనిని రూపొందించామని ఆయన అన్నారు. సినిమాలో ఎక్కడ మొదలుపెట్టి, ఎక్కడ భయపెట్టాలో, ఎక్కడ ప్రేక్షకులకు థ్రిల్ కలిగించాలో తెలిసిన దర్శకుడు సుందర్ అని, తెలుగులో ఈ చిత్రాన్ని దర్శకుడు మారుతి తన స్నేహితులతో విడుదల చేయడం సంతోషదాయకమని కథానాయకుడు సిద్ధార్థ్ అన్నారు. అనుకున్న టైమ్‌లోనే దర్శకుడు ఈ చిత్రాన్ని పూర్తిచేశారని, ‘చంద్రకళ’ ఎంత పెద్ద విజయం సాధించిందో అంతే విజయాన్ని ఈ చిత్రం అందుకుంటుందని, ఈనెల 29న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నటి ఖుష్బు తెలిపారు. తమిళంలో మంచి బ్రాండ్ ఉన్న సుందర్ సిద్ధార్థ్‌కు తొలిసారిగా హారర్ చిత్రాన్ని రూపొందించారని, ‘కళావతి’ చిత్రాన్ని తమ సంస్థ విడుదల చేయడం సంతోషంగా వుందని దర్శకుడు మారుతి తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: హిప్‌హాప్, సమర్పణ: జవ్వాజి రామాంజనేయులు, నిర్మాణం: గుడ్‌ఫ్రెండ్స్, దర్శకత్వం: సుందర్.సి.