ది రెవెనెంట్‌కు గోల్డెన్‌గ్లోబ్ అవార్డుల పంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ చలన చిత్రరంగంలో ఆస్కార్ తరువాత అంతటి కీర్తిప్రతిష్టలున్న పురస్కారం ‘గోల్డెన్‌గ్లోబ్’ అవార్డు. 2015గాను ఏకంగా మూడు అవార్డులను సొంతం చేసుకుని సంచలనం సృష్టించిన చిత్రంగా ‘ది రెవెనెంట్’ నిలిచింది. కాలిఫోర్నియాలో అట్టహాసంగా జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ఈ చిత్రబృందం ఆనందడోలికల్లో తేలిపోయింది. ఈ సినిమా ఉత్తమచిత్రంగా, దర్శకత్వం వహించిన అలెజాండ్రో జిఇనారిట్టు ఉత్తమ దర్శకుడిగా, ఇందులో ప్రధానపాత్ర పోషించిన లియోనార్డొ డి కాప్రియో ఉత్తమ నటుడిగా గోల్డెన్‌గ్లోబ్ అవార్డులు కైవసం చేసుకున్నారు. అమెరికన్ యోధుడి జీవితచరిత్ర ఆధారంగా ‘ది రెవెనెంట్’ చిత్రం రూపొందించారు. కీకారణ్యంలో జంతువులను మాటువేసి, వేటాడే ప్రైవేటుసైన్యానికి చెందిన ఓ యోధుడిని, చనిపోయాడనుకుని తోటి వేటగాళ్లు వదిలేసి వెళ్లిపోవడం, ఆ తరువాత అతడు మళ్లీ ఎలా బతికిబయటపడ్డాడన్న కథ ఆధారంగా దీనిని రూపొందించారు. 18వశతాబ్దంలో హగ్‌గ్లాస్ అనే వేటగాడి జీవితకథ ఆధారంగా దీనిని నిర్మించారు. ఈ చిత్రంలో అత్యుత్తమ నటన ప్రదర్శించిన కాప్రియో ఈసారి గోల్డెన్‌గ్లోబ్ అవార్డు సాధించారు. ఈ అవార్డు దక్కడం ఇతనికి ఇది మూడోసారి. 2005లో ‘ది ఏవియేటర్’, 2014లో ‘ది ఓల్ఫ్‌ఆఫ్ వాల్‌స్ట్రీట్’ చిత్రాల్లో నటనకు గోల్డెన్‌గ్లోబ్ అవార్డులు దక్కాయి. ఈ అవార్డు పొందడాన్ని అత్యుత్తమ గౌరవంగా హాలీవుడ్ నటులు భావిస్తారు. ఈ గోల్డెన్‌గ్లోబ్ అవార్డులు దక్కితే ఆస్కార్ అవార్డులు దక్కే అవకాశం ఉందని భావించడమే అందుకు కారణం. హాలీవుడ్‌లో 93మంది సభ్యులతో కూడిన హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేష్ ఆధ్వర్యంలో ఈ పురస్కార గ్రహీతలను ఎంపిక చేస్తారు. ఎంటర్‌టైన్‌మెంట్ రంగానికి విశేష సేవలు అందించిన సినిమా, టీవిరంగాలకు చెందిన ప్రతిభావంతులకు ఏటా వీటిని ప్రకటిస్తారు.
కాగా 2015 సంవత్సరానికి సంబంధించి బెస్ట్‌మోషన్ పిక్చర్‌గా ది రెవనెంట్ నిలిస్తే కామెడి, మ్యూజిక్ విభాగాల్లో ‘ది మార్టియన్’ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఇక మోషన్ పిక్చర్స్ విభాగంలో ఉత్తమ నటిగా ‘రూమ్’ హీరోయిన్ బ్రి లార్సన్ ట్రోఫీ ఎగరేసుకుపోగా ఉత్తమ సహాయ నటిగా కటె విన్స్‌లెట్ అవార్డు నెగ్గింది. ‘స్టీవ్‌జాబ్స్’ చిత్రంలో ఆమె నటనకుగాను ఈ అవార్డు దక్కింది. ఇదే సినిమాకు స్క్రీన్‌ప్లె అందించిన ఆరాన్ సార్కిన్‌కు బెస్ట్ స్క్రీన్‌ప్లే అవార్డూ వరించింది. కాగా ఉత్తమ సహాయ నటుడిగా ‘క్రీడ్’లో నటించిన సిల్వస్టర్ స్టాలొన్‌కు అవార్డు దక్కింది. ఉత్తమ విదేశీభాషా చిత్రంగా ‘సన్ ఆఫ్ సాల్’ అవార్డు దక్కించుకుంది. ఈ అవార్డుల ప్రదానోత్సవానికి హాలీవుడ్‌కు చెందిన తారలు హాజరై కనువిందు చేశారు.
chitram...

‘గోల్డెన్‌గ్లోబ్’ అవార్డులతో ఉత్తమ దర్శకుడు ఇనారిట్టు,
ఉత్తమ నటుడు లియోనార్డొ డి కాప్రియో

ఉత్తమ నటి
బ్రి లార్సన్