రాజుగారింట్లో... అన్నీ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అజయ్ భరత్, అర్జున్, వెంకటేష్, సుస్మిత, బిందు, బార్బి ప్రధాన తారాగణంగా భరత్ ఫిలిం ఫాక్టరీ పతాకంపై ఫిరోజ్ రాజా దర్శకత్వంలో భరత్‌కుమార్ పీలం రూపొందించిన చిత్రం ‘రాజుగారింట్లో 7వ రోజు’. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, హారర్ సబ్జెక్టుగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు నచ్చేలా రూపొందించామని, కథ, కథనాలుతోపాటుగా పాటలు అందరికీ నచ్చుతాయని, ఇటీవల విడుదల చేసిన ట్రైలర్స్ అందరికీ నచ్చాయని తెలిపారు. విడుదలయ్యాక తప్పక అందరికీ నచ్చే ఈ చిత్రాన్ని ఈనెలాఖరుకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. క్రైమ్ ఆధారంగా రూపొందిన ఓ హారర్ చిత్రంగా 7వ రోజు చిత్రాన్ని చేశామని, స్క్రీన్‌ప్లే వైవిధ్యంగా సాగే ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని దర్శకుడు ఫిరోజ్ రాజా అన్నారు. నాలుగు పాటలతో రూపొందిన ఈ చిత్రానికి యు/ఎ సర్ట్ఫికెట్ వచ్చిందని ఆయన అన్నారు.