వంగవీటిపై ధవళ సత్యం చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాస్తవ సంఘటనలు, వ్యక్తుల నిజ జీవిత చరిత్రలను కథాంశాలుగా తీసుకుని రూపొందించిన చిత్రాలు ఎప్పుడూ మంచి విజయాన్ని అందుకుంటూనే వుంటాయి.
అలాంటి నేపథ్యంలో చాలా చిత్రాలు రూపొందాయి కూడా. 28 ఏళ్ళ క్రితం అలాంటి నేపథ్యంతో రూపొందిన ‘చైతన్యరథం’ చిత్రం ఘనవిజయం సాధించింది. అప్పటి రాష్ట్ర రాజకీయాలను, ముఖ్యంగా విజయవాడ కేంద్రంగా కృష్ణా జిల్లా రాజకీయాలను శాసించిన వంగవీటి సోదరుల నిజ జీవిత కథతో ధవళ సత్యం ఈ చిత్రాన్ని రూపొందించాడు. తాజాగా వంగవీటి రంగా నిజ జీవిత చరిత్ర ఆధారంగా ధవళ సత్యం మరో సినిమా రూపొందించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. రంగా మిత్రమండలి సమర్పణలో ఎం.ఎస్.ఆర్. క్రియేషన్స్ పతాకంపై మంచాల సాయి సుధాకర్ నాయుడు నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి ధవళ సత్యం వివరాలు తెలియజేశారు. ‘28 ఏళ్ళ క్రితం నా దర్శకత్వంలో వచ్చి అద్భుత విజయాన్ని సాధించిన ‘చైతన్యరథం’ వంగవీటి రాధ-రంగాల నిజ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందింది. రాధ హత్యానంతరం నాయకత్వ బాధ్యతలు తీసుకున్న రంగా ఎంత పవర్‌ఫుల్ లీడర్‌గా ఎదిగాడో అందరికీ తెలిసిందే. యధార్థ సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాం’ అని ఆయన అన్నారు. మరోవైపు సంచలన దర్శకుడు రాంగోపాల్‌వర్మ ‘వంగవీటి’ అనే టైటిల్‌తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ టైటిల్‌ను అనౌన్స్ చేశారు కూడా. మరి ఈ రెండు సినిమాలు ఎలాంటి సంచలనాన్ని సృష్టిస్తాయో చూడాలి.