రూటు మార్చింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమధ్య మైనా సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న అందాల భామ అమలాపాల్ ఆ తర్వాత వరుస అవకాశాలతో క్రేజీ హీరోయిన్‌గా మారింది. పలు చిత్రాల్లో నటించి, మంచి గ్లామర్ భామగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఈమధ్యే దర్శకుడు విజయ్‌ని వివాహం చేసుకుని, సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈ భామ సూర్య హీరోగా నటిస్తూ నిర్మించిన మేము చిత్రంలో తల్లి పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత ఇప్పుడు మరో సినిమాకి ఓకే చెప్పిందట. అయితే ఈ సినిమాలో కూడా తల్లి పాత్రలో నటిస్తోందట. హీరోయిన్‌గా మంచి క్రేజ్ ఉన్న సమయంలో ఇలా తల్లి పాత్రలు చేయడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. మరి ఈ సినిమా తర్వాత అమలాపాల్ రూటు మార్చి ఇదే దారిలో వెళ్తుందో లేదా హీరోయిన్‌గా చేస్తుందో చూడాలి! ప్రస్తుతం అమలాపాల్ నటించే చిత్రాన్ని ప్రముఖ నటుడు ధనుష్ నిర్మిస్తున్నాడట. ‘అమ్మకణక్కు’ అనే పేరుతో ఈ చిత్రం రూపొందనుంది.