తెలుగు సినిమాకు అవార్డు గర్వకారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు ప్రేమకథ అంటే మంచి కామెడీ, త్యాగం, ప్రేమయొక్క పవిత్రత వుండేలా సినిమాలు రూపొందించారు. మరోచరిత్ర, మజ్ను, అనార్కలి లాంటి గొప్ప గొప్ప చిత్రాలతోపాటుగా పెళ్లికానుక ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయాయి. అవి ప్రేమకథా చిత్రాల విలువ. ప్రస్తుతం కామ కథలే ప్రేమకథలుగా మార్చి సినిమాలు తీస్తున్న నేపథ్యంలో జైపూర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో లగడపాటి శ్రీ్ధర్ రూపొందించిన ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ చిత్రానికి బెస్ట్ రొమాంటిక్ ఫిలిం అవార్డు రావడం, అందులోనూ తెలుగు చిత్రానికి రావడం గర్వంగా వుందని దర్శకుడు దాసరి నారాయణరావు అన్నారు. సుధీర్‌బాబు, నందిత జంటగా రామలక్ష్మి క్రియేషన్స్ పతాకంపై ఆర్.చంద్రు దర్శకత్వంలో రూపొందించిన ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ చిత్రానికి బెస్ట్ రొమాంటిక్ చిత్రంగా జైపూర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో అవార్డు వరించింది. ఈ సందర్భంగా దాసరి నారాయణరావు ఇంటిలో చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ, ప్రేమకథల రూపమే మారిపోయిన నేటి పరిస్థితుల్లో ఇలాంటి చిత్రాన్ని రూపొందించిన శ్రీ్ధర్‌ను తాను అభినందించానని, సినిమా సూపర్‌హిట్ అవుతుందని అపుడే చెప్పానని అన్నారు. దర్శకుడు మంచి ప్రతిభతో సినిమా రూపొందిస్తే, కృష్ణ కుటుంబంనుండి వచ్చిన సుధీర్‌బాబు నటనలో ప్రతిభ చూపాడని, విలన్‌గా కూడా నటిస్తున్న అతను మంచి ప్రామిసింగ్ నటుడు కావాలని ఆయన దీవించారు. ఈ చిత్రానికి అవార్డు వచ్చినందుకు దాసరి నారాయణరావు తన ఇంటికి పిలిచి మరీ అభినందించి ప్రోత్సహించడం ఆనందాన్నిస్తోందని, శ్రీమంతుడు, బాహుబలి చిత్రాలకు పోటీగా నిలబడి 50 రోజులు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని హిందీలో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత శ్రీ్ధర్ అన్నారు. ఎన్ని సినిమాలు వచ్చినా ప్రేక్షకులలో కథానాయకుడికి గౌరవం పెరగాలని, అటువంటి గౌరవాన్ని ఈ చిత్రం తనకు అందించిందని హీరో సుధీర్‌బాబు తెలిపారు. కార్యక్రమంలో దర్శకుడు చంద్రు, గిరిబాబు, ఎన్.శంకర్, నీలకంఠ తదితరులు పాల్గొని చిత్ర యూనిట్‌కు అభినందనలు అందించారు.