వరుణ్ సరసన..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది గ్లామర్ భామ రకుల్ ప్రీత్‌సింగ్. స్టార్ హీరోల సరసన అవకాశాలు కొట్టేస్తూ బిజీగా వున్న ఈ భామ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో నటించిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. దాంతోపాటు అల్లు అర్జున్ సరసన నటిస్తున్న ‘సరైనోడు’? చిత్రం షూటింగ్‌లో పాల్గొంటోంది. ఈ సినిమా తరువాత రకుల్ స్పీడు పెంచేందుకు రెడీ అయింది. ఇప్పటికే మరో మెగా హీరో సినిమాలో
నటించేందుకు ఓకె చెప్పినట్లు తెలిసింది. ‘కంచె’, ‘లోఫర్’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న
మెగా హీరో వరుణ్‌తేజ్ సరసన హీరోయిన్‌గా నటించేందుకు ఓకె చెప్పింది. ఇప్పటికే వరుణ్‌తేజ్ రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు. క్రిష్ దర్శకత్వంలో రాయబారి, దాంతోపాటు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్నాయి. రకుల్ ప్రీత్‌సింగ్ ఈరెండు చిత్రాల్లో ఏ సినిమాలో వరుణ్ సరసన నటిస్తుందనేది ఆసక్తిగా మారింది. మొత్తానికి స్టార్ హీరోలతోపాటు లేటెస్టు హీరోలను కూడా వదలడంలేదు ఈ భామ.