మెగా జోడీ కుదిరింది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొంత గ్యాప్ తర్వాత ప్రముఖ నటుడు చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ, ప్రత్యేకంగా రూపొందించే 150వ చిత్రంపై నిర్ణయం కొన్ని రోజులుగా వాయిదా పడుతూనే వస్తోంది. మెగాస్టార్ 150వ సినిమాకోసం అభిమానులు చాలా ఆసక్తితో ఎదురుచూస్తున్నారుకూడా. మొత్తానికి 150వ చిత్రం దాదాపు ఖరారైనట్టే. తమిళంలో ఘన విజయం సాధించిన ‘కత్తి’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కించే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జోరందుకున్నాయి. ఈ సంక్రాంతి తర్వాత ఈ సినిమా మొదలుకానుంది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రంలో హీరోయిన్ కూడా ఓకే అయినట్టు తెలిసింది. చిరంజీవి సరసన నటించే హీరోయిన్ ఎవరా అని ఆసక్తి అందరిలోనూ మొదలైంది. దానికితోడు పలువురు క్రేజీ హీరోయిన్ల పేర్లు కూడా వినిపించాయి. ఫైనల్‌గా సౌత్ క్రేజీ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నయనతార చిరంజీవికి జోడీగా నటిస్తుందని తెలిసింది. ఇప్పటికే వినాయక్ దర్శకత్వంలో రెండు చిత్రాలు చేసింది నయనతార. దాంతో ఆమెను ఈ సినిమాకి హీరోయిన్‌గా తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన అధికారిక వివరాలు త్వరలోనే
వెల్లడికానున్నాయి.