నాగార్జునతో అనగానే షాకయ్యా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అందాలరాక్షసి’గా తెలుగు ప్రేక్షకులను అలరించి ఆ తరువాత ‘దూసుకెళ్తా’ చిత్రంలో నటించి తాజాగా ‘్భలే భలే మగావడివోయ్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది లావణ్య త్రిపాఠి. అచ్చతెలుగు అమ్మాయిగా నటనతోపాటు గ్లామర్‌ను ప్రదర్శిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ భామ తాజాగా అక్కినేని నాగార్జున సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. నాగార్జున ద్విపాత్రాభినయంతో కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న సందర్భంగా లావణ్య త్రిపాఠితో మాటామంతి...
నాగార్జునతో నటించడం ఎలా వుంది
నాగార్జునతో సినిమా చేస్తున్నాను అన్న వార్త విన్నపుడు చాలా షాకయ్యాను. నిజంగా అలాంటి స్టార్ హీరోతో నటించడం ఛాలెంజింగ్‌గా అనిపించింది.
ఇందులో మీ పాత్ర
సాంప్రదాయ కుటుంబంనుంచి వచ్చిన అమ్మాయిగా కనిపిస్తాను. ఈ సినిమాలో ఎక్కువ శాతం చీరల్లోనే కనిపిస్తాను. రెగ్యులర్ హీరోయిన్‌గా కాకుండా చాలా షేడ్స్ వుంటాయి.
నాగార్జున పాత్రలెలా వుంటాయి?
ఇందులో ఆయన బంగార్రాజు, రాము అనే రెండు పాత్రల్లో కన్పిస్తారు. రెండూ విభిన్నమైన పాత్రలే. ఆయన నటన గురించి నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు.
రమ్యకృష్ణతో పనిచేయడం?
రమ్యకృష్ణ లాంటి సీనియర్ నటితో పనిచేయడం లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఆమె చాలా ఓపెన్‌గా వుండే మనిషి. నన్ను చాలా ప్రోత్సహించారు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయిపోయాం.
దర్శకుడు గురించి
కల్యాణ్‌కృష్ణ ఈ సినిమా చేస్తున్నపుడు తను కొత్త డైరెక్టర్ అని నాకన్పించలేదు. ప్రతి విషయంపట్ల క్లారిటీ వున్న వ్యక్తి. మంచి కాన్ఫిడెంట్‌తో కన్పిస్తాడు.
సినిమా హిట్స్, ఫ్లాప్‌లపై మీ ఫీలింగ్
ఎవరికైనా సక్సెస్ వస్తేనే హ్యాపీ. అందుకనే గ్యాప్ తీసుకుని మంచి స్క్రిప్ట్ వున్న సినిమాల్లోనే నటిస్తున్నాను. స్టార్ హీరోల సినిమాలైనా సరే కథ నచ్చాలి. లేదంటే హీరోయిన్ ఐరెన్‌లెగ్ అంటారు.
‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ సినిమా గురించి
ఇందులో మూడు డిఫరెంట్ షేడ్స్ వున్న పాత్రలో కన్పిస్తాను. ముఖ్యంగా అంకాలమ్మ అనే పాత్ర వైవిధ్యంగా వుంటుంది. ఈ సినిమా రిలీజ్ కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నా.
అల్లు శిరీష్ సినిమా గురించి
అల్లు శిరీష్‌తో నటిస్తున్న సినిమాలో కాలేజీ అమ్మాయిగా కన్పిస్తా. డిఫరెంట్ పాత్ర కాదు కానీ ఉన్నంతలో విభిన్నంగా కన్పించడానికి ప్రయత్నిస్తా.
తదుపరి చిత్రాలు
కొత్త దర్శకుడు చెప్పిన కథ బాగా నచ్చింది. చాలా డిఫరెంట్ కారెక్టర్. సినిమా త్వరలోనే ప్రారంభం అవుతుంది. -శ్రీ