కబాలీ కోసం హాలీవుడ్ విలన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం కబాలీ. పి.ఎ.రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం చెన్నైలో చివరి షెడ్యూల్ జరుపుకుంటోంది. రజనీకాంత్ వయసుకు దగ్గ పాత్రలో నటిస్తున్నాడు. మాఫియా డాన్‌గా రజనీ నటిస్తున్న ఈ సినిమా కోసం ఓ భారీ ఏక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరించనున్నారట. ఈ చిత్రంలో విలన్లుగా హాలీవుడ్ నటులు కనిపిస్తారని తెలిసింది. ఇప్పటికే జెట్‌లీ పేరు వినిపించిన విషయం తెలిసిందే. ఆయన ఈ సినిమా చేయడం లేదు. ఆ స్థానంలో తైవాన్ నటుడు విన్‌స్టన్ చవో, మలేసియన్ నటుడు రోసియం నోర్‌ను ఎంపిక చేశారు. వీరికి హాలీవుడ్‌లో మంచి క్రేజ్ వుంది. రజనీకి తగ్గ విలన్లుగా వీరిని ఎంపిక చేశారట. మరోవైపు రజనీకి మలేసియా, జపాన్, చైనాలలో మంచి క్రేజ్ వున్న విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాకు రెట్టింపు క్రేజ్ రావడం సహజమే. భారీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే నెలలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.