9న కృష్ణాష్టమి ఆడియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సునీల్, నిక్కీగల్రాని జంటగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై వాసువర్మ దర్శకత్వంలో రాజు నిర్మించిన ‘కృష్ణాష్టమి’ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ దినేష్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను ఈనెల 9న విడుదల చేయనున్నామని, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అందరికీ నచ్చేలా రూపొందిందని తెలిపారు. రాజమండ్రి, గైట్ కాలేజీలో ఈనెల 9న ఆడియో విడుదల చేస్తున్నామని, క్లాస్‌మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలున్నాయని, అమెరికానుండి వచ్చిన ఓ కుర్రాడు ఇండియాలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనే కథనంతో సాగుతుందని దర్శకుడు తెలిపారు. డింపుల్‌చోపడే, బ్రహ్మానందం, అశుతోష్ రాణా, ముఖేష్ రుషి, పోసాని, సుమన్, సప్తగిరి, పవిత్రలోకేష్, తులసి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: చోటా కె.నాయుడు, ఎడిటింగ్: గౌతంరాజు, నిర్మాత: రాజు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వాసువర్మ.