బొంబాయి మిఠాయి ట్రైలర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిరంజన్ దేశ్‌పాండే, దిశా పాండే జంటగా చంద్రమోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బొంబాయి మిఠాయి’. కన్నడలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులోకి భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ ట్రైలర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఏ ఫిలిం బై అరవింద్ సినిమా గుర్తొస్తోందని, మిత్రుడు ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించడం ఆనందంగా వుందని, కన్నడంలో మంచి హిట్ అయిన ఈ చిత్రం తెలుగులో కూడా సూపర్‌హిట్ అవ్వాలని అన్నారు. సమర్పకులు రాజ్ కందుకూరి మాట్లాడుతూ, ఈ సినిమాను తానే విడుదల చేద్దామనుకున్నానని, కానీ రామసత్యనారాయణ అడగడంతో ఇద్దరం కలిసి చేస్తున్నామన్నారు. రామసత్యనారాయణ మాట్లాడుతూ, కేవలం రెండు కోట్ల బడ్జెట్‌తో కన్నడంలో తెరకెక్కి 15 కోట్లకుపైగా వసూలు సాధించిన చిత్రమిదని, చిన్న చిత్రాల్లో పెద్ద విజయాన్ని అందుకున్న ఈ చిత్రం తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. జనవరి 22న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు.