22న ప్రేమికులపై పిహెచ్‌డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిత్య, సోనాలి జంటగా కోట మునీష్ దర్శకుడిగా ఆదిత్య క్రియేషన్స్ పతాకంపై లక్ష్మీ శ్రీవాత్సవ నిర్మాతగా రూపొందిస్తున్న ప్రేమికులపై పిహెచ్‌డి చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని పూర్తిచేసుకుని ఈనెల 22న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్న సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ- మంచి ప్రేమకథతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో రూపొందుతోంది. ఈ నెల 22న భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. దర్శకుడు కోట మునీష్ మాట్లాడుతూ- ఇప్పటివరకూ వృత్తిపరంగా పిహెచ్‌డిలు పొందిన వారిని చూశాము. కానీ ప్రేమికులపై పిహెచ్‌డి చేసేవారిని ఈ సినిమాలో చూపించబోతున్నాము. ప్రతిఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ప్రేమలో పడతారు. ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులకు కూడా గత జ్ఞాపకాలు గుర్తొస్తాయి. ఇప్పటికే విడుదలైన సంగీతం మంచి విజయాన్ని సాధించింది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:రమేష్ ముక్కెర.