ఎక్స్‌ప్రెస్ రాజాకు యు సర్ట్ఫికెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శర్వానంద్, సురభి జంటగా యువి క్రియేషన్స్ పతాకంపై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వంశీ ప్రమోద్ రూపొందించిన చిత్రం ‘ఎక్స్‌ప్రెస్ రాజా’. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.
యు సర్ట్ఫికెట్ లభించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 14న సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ సంగీతానికి ఇప్పటికే మంచి ఆదరణ లభిస్తోందని, గతంలో వచ్చిన ‘రన్‌రాజా రన్’ కాంబినేషన్‌లో రూపొందించిన ఈ చిత్రం సెన్సార్ సభ్యుల ప్రశంసలు పొందిందని, హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో ప్రేక్షకులకు కావలసిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని వారు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నామని వారు తెలిపారు. ఊర్వశి, హరీష్ ఉత్తమన్, పోసాని కృష్ణమురళి, సూర్య, నాగినీడు, బ్రహ్మాజీ, సుప్రీత్, సప్తగిరి, ప్రభాస్ శ్రీను, షకలక శంకర్, ధన్‌రాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, కెమెరా: కార్తిక్ ఘట్టమనేని, ఎడిటింగ్: సత్య జి, పాటలు: శ్రీమణి, భాస్కరభట్ల, శ్రీజో, నిర్మాతలు: వంశీ, ప్రమోద్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మేర్లపాక గాంధీ.