ముద్దు సీన్ కష్టమన్పించలేదు -- హీరోయిన్ పల్లక్ లల్వాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగశౌర్య హీరోగా నటించిన ‘అబ్బాయితో అమ్మాయి’ సినిమా ద్వారా పరిచయం అయింది కొత్త హీరోయిన్ పల్లక్ లల్వాని. జె.జి.సినిమాస్, కిరణ్ స్టూడియోస్ పతాకాలపై రమేష్‌వర్మ దర్శకత్వంలో కిరీటి, శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మించిన ‘అబ్బాయితో అమ్మాయి’. జనవరి 1న విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ పల్లక్ లల్వానితో మాటామంతి....
ఈ అవకాశం ఎలా వచ్చింది?
గతంలో ఓ సౌత్ సినిమాకోసం ఆడిషన్ చేశారు. దర్శకుడు రమేష్‌శర్మ నా ఫొటోలు చూసి ముంబై వచ్చి కలిశారు. నాతోపాటు అమ్మకు స్క్రిప్ట్ వినిపించారు. ప్రార్థన పాత్రలో నటించేలా ఆయనే ఒప్పించారు.
రెస్పాన్స్ ఎలా ఉంది?
మొదటి సినిమా అయినా, ఈ అమ్మాయి బాగా నటించిందంటూ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఇదే. నా దృష్టిలో ప్రతిభే ముఖ్యమని నమ్ముతాను. ఓ గ్లామర్ డాల్‌గా ఉండాలనుకోవట్లేదు.
మీరు రియల్ లైఫ్‌లో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్
ఉపయోగిస్తారా..?
ప్రస్తుతం నేను ఫేస్‌బుక్, ఇతర సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో లేను. అప్పట్లో నేనుకూడా ఫేస్‌బుక్ క్రియేట్ చేసుకొని అందరిలా చాటింగ్ చేసేదాన్ని. ప్రస్తుతం అయితే సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో ఎక్కువ యాక్టివ్‌గా లేను.
రొమాంటిక్ సీన్స్‌లో
నటించడం?
ఈ చిత్రంలో పల్లక్....నాగశౌర్యను ముద్దుపెట్టుకోవడం లేదు. కేవలం ఆయా పాత్రలపరంగా ప్రార్థన, అభి ముద్దుపెట్టుకున్నారు. అక్కడితో ఆ సీన్ అయిపోయింది. అయినా శౌర్యతో అలా నటించడం కష్టం అనిపించలేదు. అప్పటికే మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాం. తను చాలా న్యాచురల్‌గా నటిస్తాడు.
డైలాగులు చెప్పడానికి
కష్టపడ్డారా?
నేను ముంబైలో పెరిగాను, అమ్మ పంజాబీ. దక్షిణాది భాషల గురించి అవగాహన లేదు. నార్త్ ఇండియన్స్ అందరూ.. దక్షిణాది భాష ఒక్కటే అనుకుంటారు. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ.. వేర్వేరు భాషలని ఈ చిత్రంలో నటించిన తర్వాత అర్థమైంది. చిత్రీకరణలో నా డైలాగులను బట్టీపట్టాను. యూనిట్ సభ్యులందరూ ఎంతో సహాయం చేశారు.
తెలుగులో మీ ఫేవరెట్ హీరో?
ముందు మహేష్‌బాబు పేరు చెప్తాను. తర్వాత చాలామంది స్టార్ హీరోలున్నారు.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్?
ఇంకా ఏదీ ఫైనల్ చేయలేదు. ప్రస్తుతం డిస్కషన్స్ జరుగుతున్నాయి.

- శ్రీ