స్పీడున్నోడు టీజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమనేని శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన ‘సుందరపాండ్యన్’ను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, సోనారిక జంటగా నిర్మిస్తున్న ‘స్పీడున్నోడు’ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. భీమనేని సునీత నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం గూర్చి దర్శకుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ సినిమా షూటింగ్ అంతా పూర్తిచేశామని, నాలుగురోజుల ప్యాచ్‌వర్క్ కార్యక్రమాలు ఉన్నాయని, డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తిచేసి, రీరికార్డింగ్ కార్యక్రమాలు జరుపుతున్నామని తెలిపారు. సంక్రాంతి కానుకగా సినిమా పాటలను విడుదల చేస్తామని, ఫిబ్రవరి మొదటి వారంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఈ చిత్రం మాతృక తమిళంలో, కన్నడంలో పెద్దహిట్ అయిన నేపధ్యంలో తెలుగు రీమేక్ చేయడానికి ముందుకు వచ్చామని, తెలుగు నేటివిటీకి దగ్గరగా అనేక మార్పులు, చేర్పులు చేశామని కథానాయకుడు శ్రీనివాస్ పాత్రకు తగిన విధంగా ఒదిగి నటించాడని ఆయన అన్నారు.‘అల్లుడు శ్రీను’ తర్వాత ఎలాంటి చిత్రంలో నటించాలా అని ఆలోచిస్తున్నప్పుడు ఈ కథ గురించి విన్నానని, తెలుగు ప్రేక్షకులకు నచ్చే కథాకథనాలు ఉండడంతో నమ్మకంగా సినిమాలో నటించానని కథానాయకుడు సాయిశ్రీనివాస్ అన్నారు. ఈ సినిమాను బయ్యర్లు ఫ్యాన్సీ రేట్లకు కొనడం ఆనందాన్నిస్తోందని, సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలని వివేక్ తెలిపారు. కార్యక్రమంలో గౌతంరాజు, విజయ్, చైతన్యకృష్ణ, కిరణ్‌కుమార్, వసంత్ తదితరులు చిత్ర విశేషాలను తెలిపారు.