మోత మోగనున్న సంక్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంక్రాంతి పండుగకు స్పెషల్ ఐటెమ్ కోడిపందాలు. ఈసారి తెలుగు తెర కూడా కోడిపందాలను జరుపుకోనుంది. ఈ పందెంలో గెలుపు పుంజులు ఎవరు అనేది త్వరలో తెలియనుంది. సంక్రాంతికి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘డిక్టేటర్’ రంగంలోకి దిగుతుండగా, జూ. ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ కూడా విడుదలవుతోంది. తానేం తక్కువ కాదంటూ ఈసారి నాగార్జున సంక్రాంతికి రంగంలోకి దిగుతున్నాడు సోగ్గాడిగా. సోగ్గాడే చిన్నినాయన చిత్రంతో ఆయన సంక్రాంతి బుల్లోడిగా తెలుగు ప్రేక్షకులను అలరించనున్నాడు. సహజంగా ప్రతి సంవత్సరం డిసెంబర్‌లో తన సినిమా విడుదలయ్యాలా చూసుకునే నాగార్జున ఈసారి సంక్రాంతి కోడిపుంజుగా మారాడు. దీంతో టాలీవుడ్ సంక్రాంతి రసకందాయంలో పడింది. ఓవైపు బాలకృష్ణ, మరోవైపు ఎన్టీఆర్, ఇంకోవైపు నాగార్జున పందెం కోళ్ళులా కాలు దువ్వుతున్నారు. వీరి ముగ్గురిమధ్య మరో యువ హీరో ‘ఎక్స్‌ప్రెస్ రాజా’నంటూ శర్వానంద్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. పెద్ద సినిమాలమధ్య ఆయన సినిమా ఏపాటిది అని విశే్లషకులు ప్రశ్నిస్తున్నారు. అయినాకానీ దర్శకుడికి వున్న స్టామినాతో ఈ చిత్రం సంక్రాంతి పందెం కోళ్ళతో పోరాడగలదన్న నమ్మకంతో శర్వానంద్ సంక్రాంతికి వచ్చేస్తున్నాడు. ఈ నాలుగు చిత్రాలకు సంబంధించిన వ్యాపారం కూడా పూర్తయిందట. అన్నిటికన్నా ముందుగా ‘నాన్నకు ప్రేమతో’ చిత్రానికి మంచి అప్లాజ్ వస్తోంది. సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా ప్రేక్షకులకు ఆసక్తి రేపుతోంది. ఆ తరువాత సోగ్గాడే చిన్నినాయనలో నాగార్జున స్టిల్సే ప్రేక్షకులకు మత్తెక్కిస్తున్నాయి. చాలా రోజుల తరువాత పంచెకట్టుతో కన్పిస్తున్న నాగార్జున తెలుగు ప్రేక్షకులను అచ్చమైన సంక్రాంతి సోగ్గాడిగా అలరించనున్నారు. ఏతావాత తేలింది ఏమంటే, డిక్టేటర్ స్క్రీన్‌ప్లే రచయిత కోన వెంకట్ అవడంతో ఈ చిత్రంపై బాలకృష్ణ అభిమానులకు అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బి, సి సెంటర్లలో ఇప్పటికే డిక్టేటర్ తన ఆధిపత్యాన్ని చూపిస్తున్నాడట. సంక్రాంతి కానుకగా వరుసపెట్టి విడుదల కానున్న ఈ నాలుగు చిత్రాల్లో ఎవరు విజేత అనేది త్వరలో తెలియనుంది. అప్పటిదాకా సస్పెన్స్ భరించక తప్పదు మరి!