సంక్రాంతికి విశాల్ కథకళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాల్ కథానాయకుడిగా పాండ్యరాజ్ దర్శకత్వంలో విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై రూపొందించిన చిత్రం ‘కథకళి’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 14న సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హీరో, నిర్మాత విశాల్ మాట్లాడుతూ, తన కెరీర్‌లో మరో డిఫరెంట్ కమర్షియల్ చిత్రంగా ‘కథకళి’ రూపొందిందని, డైరెక్టర్ పాండ్యరాజ్ కథను అద్భుతంగా డీల్ చేశారని, ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ సినిమా మరో హిట్ మూవీగా నిలుస్తుందని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని తెలిపారు. కేథరీన్ ట్రెస్సా, రెజీనా కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో నాజర్, కరుణాస్, శత్రు, సూరి, శ్రీజిత్ రవి, పవన్, మైమ్‌గోపి, మధుసూదనరావు తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కెమెరా:బాలసుబ్రమణ్యం, సంగీతం:హిట్ హాప్ తమిళ, ఎడిటింగ్: ప్రదీప్ ఇ.రాఘవ్, మాటలు: శశాంక్ వెనె్నలకంటి, పాటలు:్భవనచంద్ర, వెనె్నలకంటి, నిర్మాత:విశాల్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:పాండ్యరాజ్.