లేడీ గెటప్ రెమో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శివ కార్తికేయన్, కీర్తిసురేష్ జంటగా బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రెమో’. నిర్మాత రాజు తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్‌లుక్, పాటల విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత రాజు మాట్లాడుతూ- ‘తమ సంస్థలో 25వ సినిమాగా దీన్ని విడుదల చేస్తున్నామని, ఇప్పటివరకూ ఏ సినిమాను తాము రీమేక్ చేయలేదని, ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ చూడడంతో రీమేక్ చేయాలన్న కోరిక కలిగిందని, సినిమాను డబ్ చేసి విడుదల చేయడానికి సిద్ధమయ్యానని అన్నారు. హీరో శివకార్తికేయన్ ఈ చిత్రంలో మూడు వేరియేషన్స్‌ను అద్భుతంగా పండించాడని, పి.సి.శ్రీరాం కెమెరా పనితనం, అనిరుధ్ సంగీతం సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయని ఆయన అన్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్నానని కథానాయకుడు శివకార్తికేయన్ తెలిపారు. తమిళంలో విడుదలైన ఈ చిత్రం పెద్ద విజయం సాధించి తెలుగులో వస్తోందని, ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని దర్శకుడు తెలిపారు. కార్యక్రమంలో పి.సి.శ్రీరాం, అనీల్ రావిపూడి, వంశీ పైడిపల్లి, సంగీత దర్శకుడు అనిరుధ్ తదితరులు పాల్గొని చిత్ర విశేషాలను తెలిపారు.