పాటలే హైలైట్‌గా ప్రేమభిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓం శ్రీ క్రియేషన్స్ బ్యానర్‌లో అనిల్, శృతిలయ జంటగా, ఎం.ఎస్.బైరారెడ్డి, నాగరాజు నిర్మాతలుగా, ఆర్.కె.గాంధీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ప్రేమభిక్ష’. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ, ‘అనంతపురం జిల్లా భద్రపట్నం గ్రామంలో జరిగిన యథార్థ ఘటనను తీసుకుని దర్శకుడు గాంధీ ఓ మంచి కథను తయారుచేశాడు. ప్రేమభిక్ష అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించి 75 శాతం షూటింగ్ అనంతపురం జిల్లా భద్రపట్నంలోనే జరుగుతుంది. సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ సారథ్యంలో అమూల్య స్టూడియోలో సాంగ్స్ కంపోజింగ్ జరిగాయి. అనిల్, శృతిలయలు హీరో హీరోయిన్‌లుగా నటించనున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులందరూ నటిస్తున్నారు’ అన్నారు. అనిల్, శృతిలయ, సుమన్, షఫి, రాజేంద్ర, కింగ్ మోహన్, కిల్లర్ వెంకటేష్, జ్యోతి నటిస్తున్న ఈ చిత్రానికి స్టంట్స్:శంకర్, కొరియోగ్రఫి:ఎస్.ఎస్.కె.సందీప్, పాటలు:ఘంటాడి కృష్ణ, రామ్‌పైడిశెట్టి, సంగీతం:ఘంటాడి కృష్ణ, కెమెరా:ప్రమోద్.ఆర్, నిర్మాతలు:ఎం.ఎన్.బైరారెడ్డి, నాగరాజు, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం:ఆర్.కె.గాంధి.