రెండు పాత్రల్లో ధర్మయోగి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధనుష్ కథానాయకుడిగా తమిళంలో రూపొందించిన ‘కొడి’ చిత్రాన్ని తెలుగులో ‘్ధర్మయోగి’ (ది లీడర్) పేరుతో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సిహెచ్.సతీష్‌కుమార్ అనువదించారు. ఆర్.ఎస్.దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన పాటల విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. హీరో ధనుష్ తొలి సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- ‘తన కెరీర్‌లో తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని, ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ చిత్రంతో తాను దగ్గరవుతానని తెలిపారు. పాటలు బాగా వచ్చిన ఈ సినిమా ఇప్పటికే తమిళంలో హిట్ అయిందని, దీపావళికి తాను అందరినీ కలుస్తాన’ని తెలిపారు. ‘కొడి’ చిత్రాన్ని తెలుగులో భారీ అంచనాలతో విడుదల చేస్తున్నామని, తెలుగులో ధనుష్‌కు వున్న ఫాలోయింగ్ నేపథ్యంలో రెండు పాత్రలు విభిన్నంగా సాగుతాయని నిర్మాత సిహెచ్.సతీష్‌కుమార్ అన్నారు. విజయ్ తండ్రి ఎస్.ఎ.చంద్రశేఖర్ ఓ నెగెటివ్ పాత్రలో నటించిన ఈ చిత్రం దీపావళి కానుకగా రెండు భాషలలో విడుదలకు సిద్ధమవుతోందని అన్నారు. కార్యక్రమంలో దాము, ఆర్.పి.పట్నాయక్, రాజ్ కందుకూరి, మల్కాపురం శివకుమార్, రామజోగయ్య శాస్ర్తీ, వంశీకృష్ణ, భరత్‌చౌదరి, సురేష్ కొండేటి, రాజ్ మాదిరాజ్, కృష్ణుడు తదితరులు పాల్గొని చిత్ర విశేషాలను తెలిపారు. ఈ చిత్రానికి మాటలు:శశాంక్ వెనె్నలకంటి, కెమెరా:వెంకటేష్.ఎస్, ఎడిటింగ్:ప్రకాష్ మబ్బు, సంగీతం:సంతోష్ నారాయణన్, సమర్పణ:జగన్మోహిని, నిర్మాత: సిహెచ్.సతీష్‌కుమార్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఆర్.ఎస్.దురై సెంథిల్‌కుమార్.