పాటల పిల్లరాక్షసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారా అర్జున్ ప్రధాన పాత్రలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై చదలవాడ పద్మావతి అందిస్తున్న చిత్రం ‘పిల్ల రాక్షసి’. మిథున్ మాథ్యూస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను, ట్రైలర్‌ను హీరో అల్లరి నరేష్ ప్రసాద్ లాబ్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ-‘బిచ్చగాడు లాంటి మంచి చిత్రాన్ని అందించిన నిర్మాతల నుండి వస్తున్న ఈ చిత్రం విభిన్నమైన కథతో రూపొందిందని, మలయాళంలో వలే ఇది తెలుగులోకూడా హిట్ అవుతుంద’ని అన్నారు.
ఓ చిన్నారి చేసిన సాహసం ఎలాంటి పరిణామాలకు దారితీసిందనే కథనంతో రూపొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వస్తోందని, మలయాళంలో ఘన విజయం సాధించిందని కథానాయిక జాన్ కైప్పలిల్ అన్నారు. మంచి సినిమా అనేది ఎలాంటి సరిహద్దులు లేనిదని, అందరికీ చేరాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తెలుగులో తీసుకువస్తున్నామని, నవంబర్ 4న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత చదలవాడ లక్ష్మి అన్నారు. మలయాళంలో పరిచయమైన తమను తెలుగులో కూడా పరిచయం చేస్తున్నందుకు, ఓ మంచి చిత్రాన్ని అందిస్తున్నందుకు ఆనందంగా వుందని దర్శకుడు మిథున్ మాథ్యూస్ తెలిపారు.
దుల్కర్ సల్మాన్ ముఖ్య అతిథిగా నటించిన ఈ చిత్రం వైవిధ్యమైన కథనంతో రూపొందిందన్నారు. కార్యక్రమంలో జర్నలిస్టు ప్రభు, సారాఅర్జున్, సన్నీవాయనె తదితరులు పాల్గొని చిత్ర విశేషాలను తెలిపారు. ఈ చిత్రానికి మాటలు, పాటలు:్భషాశ్రీ, నిర్మాత: చదలవాడ పద్మావతి, దర్శకత్వం:మిథున్ మాథ్యూస్.